సూర్య భారీ బడ్జెట్‌ చిత్రం.. ఆ రాష్ట్రంలో ఆలస్యంగా మార్నింగ్ షోలు! | Kollywood Hero Suriya Kanguva gets Morning shows Permission in Tamil Nadu | Sakshi
Sakshi News home page

Suriya Kanguva: సూర్య కంగువా.. ఆ రాష్ట్రాల్లో మాత్రమే మార్నింగ్ షోలకు అనుమతి!

Published Wed, Nov 13 2024 4:34 PM | Last Updated on Wed, Nov 13 2024 4:53 PM

Kollywood Hero Suriya Kanguva gets Morning shows Permission in Tamil Nadu

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్‌ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్‌ మూవీ మరికొద్ది గంటల్లో బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

అయితే మొదటి రోజు తమిళనాడు ప్రభుత్వం ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతులిచ్చింది. అయితే మొదటి షో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. చివరి ఐదో షోను అర్ధరాత్రి 2 గంటలకు ముగించాలని ఆదేశించింది. ప్రేక్షకులకు అవసరమైన భద్రతా చర్యలను పాటించాలని తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను కోరింది.

అయితే తమిళనాడు వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు కంగువా షోలు మొదలు కానున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌,కేరళ రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా మార్నింగ్ షోలు ప్రదర్శించనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళలో మాత్రం తెల్లవారుజామున 4 నుంచే బెనిఫిట్‌ షోలు ప్రారంభం అవుతాయని మేకర్స్ వెల్లడించారు.

కాగా.. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాని దాదాపు ఏడు దేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, ఆనంద కీలక పాత్రల్లో నటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement