బాక్సాఫీస్ వద్ద కంగువా.. మొదటి రోజు షాకింగ్‌ కలెక్షన్స్‌! | Kollywood Star Suriya's Kanguva First Day Collections Across India | Sakshi
Sakshi News home page

Kanguva Collections: కంగువా బాక్సాఫీస్‌ వసూళ్లు.. ఆ రెండు సినిమాల కంటే వెనకే.. కానీ!

Published Fri, Nov 15 2024 11:29 AM | Last Updated on Fri, Nov 15 2024 11:50 AM

Kollywood Star Suriya's Kanguva First Day Collections Across India

కోలీవుడ్ స్టార్స్‌ సూర్య ఫ్యాన్స్‌ చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. దసరాకు రావాల్సిన కంగువా నెల రోజుల ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్‌ చిత్రం కంగువా తొలిరోజే మిక్స్‌డ్ ‍టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే కంగువాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని డిసైడ్ అయిపోయారు. సూర్య కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రం కావడంతో వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. కానీ తొలిరోజు వసూళ్లూ చూస్తే.. ఊహించనిదానికి భిన్నంగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ కంగువా అంచనాలను మించి రాణించిందా? లేదా అన్నది కలెక్షన్స్‌ చూస్తే తెలిసిపోతుంది.

తాజా సమాచారం ప్రకారం తొలిరోజు ఇండియా వ్యాప్తంగా రూ.22 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో సూర్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ కలెక్షన్స్‌గా కంగువా నిలిచింది. గతంలో ఆయన నటించిన సింగం-2 తొలిరోజు రూ.12 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. తాజాగా కంగువా ఆ రికార్డ్‌ను అధిగమించింది. ఇక దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ తొలిరోజు 40శాతం ఆక్సుపెన్సీతో నడిచినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్, విజయ్ ది గోట్‌ చిత్రాలు మొదటిరోజు 50 నుంచి 60శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి.

అయితే వసూళ్ల పరంగా చూస్తే కంగువా కోలీవుడ్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల జాబితాలో ది గోట్, వెట్టయాన్ చిత్రాలను అధిగమించలేకపోయింది. మొదటి రోజే అంచనాలను అందుకోవడంతో కంగువా విఫలమైందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సూర్య అత్యధిక భారీ బడ్జెట్‌ చిత్రం(రూ.350 కోట్లు) కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో నెలకొన్నాయి. మరి రాబోయే రోజుల్లో కంగువా కాసుల వర్షం కురిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశాపటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.

కోలీవుడ్‌లో ఓపెనింగ్‌ డే కలెక్షన్స్‌-2024

ది గోట్-      రూ.39.15 కోట్లు
వేట్టయాన్- రూ.27.75 కోట్లు
కంగువా-   రూ.22 కోట్లు
అమరన్-   రూ.17 కోట్లు
ఇండియన్2-  రూ.16.5 కోట్లు
తంగలాన్-    రూ.12.4 కోట్లు
రాయన్-      రూ.11.85 కోట్లు
కెప్టెన్ మిల్లర్-  రూ.8.05 కోట్లు
కల్కి 2898 ఏడీ-  రూ.4.5 కోట్లు
అరణ్మనై 4-   రూ.4.15 కోట్లు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement