అజిత్ సలహా ఇచ్చారు | ajith give to Seditions | Sakshi
Sakshi News home page

అజిత్ సలహా ఇచ్చారు

Published Sun, Feb 23 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

అజిత్  సలహా ఇచ్చారు

అజిత్ సలహా ఇచ్చారు

నటుడు అజిత్ చెప్పిన బాటలోనే పయనిస్తున్నానంటోంది నటి పియూ బాజ్‌పాయ్.  ఈ ఉత్తరాది భామ కో చిత్రంలో పాత్రకు మంచి మార్కులు కొట్టేసింది. కుర్రకారును కిర్రెక్కించే అందం, చక్కని అభినయం ఉన్నా ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్‌లో సరైన ఆదరణ లభించలేదు.

 

అమ్మడికి అవకాశాలు అడపాదడపానే వస్తున్నాయి. తాజాగా మహిళా దర్శకురాలు, నటి లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వం వహించే చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీ మాట్లాడుతూ లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంది. కోలీవుడ్‌లో తన తొలి చిత్రం పొయ్ సొల్లపోరోంలోనే లక్ష్మీరామకృష్ణన్‌తో కలిసి నటించానని చెప్పింది.  లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఆరోహణం చిత్రం చూసి ఆమెకు అభినందనలు తెలిపానని చెప్పింది. తాజాగా ఆమె దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపింది. ముందుగా ఒక విషయం చెప్పాలంది. తాను ఏకన్ చిత్రంలో నటుడు అజిత్‌తో కలిసి నటించానని తెలిపింది. ఆ తరువాత ఒక సారి ముంబాయిలోను మరో సారి మంగాత్తా షూటింగ్‌లోను కలిశామని చెప్పింది. అప్పుడాయన తనకో సలహా ఇచ్చారని, అదేమిటంటే అంది వచ్చిన అవకాశాలను అంగీకరించి చేయడం సులభమే, అయితే ఆ పాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టి లీనమై నటించడానికి శ్రమించాలి, అలాగే సాదాసీదా పాటలు అంగీకరించే కంటే నటన ప్రతిభను చాటే పాత్రల కోసం వేచి ఉండటం మంచిది అని సలహా ఇచ్చారన్నారు.

 

తానిప్పుడు ఆయన సలహాను పాటిస్తున్నట్లు పేర్కొంది. ఇంత కాలం తాను ఎదురు చూస్తున్న పాత్రను లక్ష్మీరామకృష్ణన్ దర్శకత్వంలో నటించనున్నట్లు చెప్పింది. ఇది కమర్షియల్  కథా చిత్రం అని చెప్పింది. పెట్రోల్ ధర ఇతివృత్తంగా తెరకెక్కనున్న చిత్రం ఇదని వెల్లడించింది. కుటుంబ నేపథ్యం ఉంటుందని ఇందులో తనది చాలా బలమయిన పాత్ర అని చెప్పింది. ఇంతకు ముందు నటించిన చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తన పాత్రకు ప్రశంసలు లభించాయని అంది. అయితే ఇకపై అజిత్ సలహాను పాటిస్తూ చిత్రాల ఎంపికలో తగు జాగ్రత్తలను తీసుకోనున్నట్లు పియా బాజ్‌పాయ్ పేర్కొంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement