
స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు హీరోయిన్ శ్రద్ధాదాస్. ఇటీవల విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ (తెలుగు హిట్ ‘టెంపర్’తమిళం రీమేక్)లో శ్రద్ధాదాస్ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘హిప్పీ’ చిత్రంలో శ్రద్ధా దాస్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రానికి టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిగంగనా సూర్యవంశీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ‘‘హిప్పీ’ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాను. ఓ ఫన్ మాస్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్నాను’’ అని పేర్కొన్నారు శ్రద్ధాదాస్. సరే..ఓన్లీ ఇలా స్పెషల్ సాంగ్స్‌తోనే శ్రద్ధాదాస్ కెరీర్ సాగుతుందని అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే... కన్నడ ‘కోటిగొబ్బ 3, ఉద్ఘర్ష’ చిత్రాల్లో శ్రద్ధాదాస్ కథానాయికగా నటించారు. అలాగే 2017లో వచ్చిన రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రంలో ఆమె జర్నలిస్టుగా నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment