Karthikeya 2: కేరళలో కార్తీకేయ-2 జోడి.. మలయాళంలోనూ గ‍్రాండ్ రిలీజ్..! | Karthikeya 2 Malayalam Movie Promotions In Cochin | Sakshi
Sakshi News home page

Karthikeya 2: కేరళలో 'కార్తీకేయ-2' జంట.. ప్రమోషన్లతో ఫుల్ బిజీ

Published Tue, Sep 20 2022 9:24 PM | Last Updated on Wed, Sep 21 2022 2:10 PM

Karthikeya 2 Malayalam Movie Promotions In Cochin   - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్‌ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఊహించని విజయాన్ని సాధించింది. బాలీవుడ్‌లో ఈ మూవీ కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను మళయాళంలోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా అఖిల్, అనుపమ కేరళలో సందడి చేశారు. తాజాగా ఈ జంట కొచ్చిన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సందడి చేసింది. ఈనెల 23న మలయాళంలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. 

(చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం)

కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరచిన కృష్ణుని కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే యువకుని కథతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కీలకమైన అతిథిపాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ ఈ మూవీలో నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా అభిషేక్‌ అగర్వాల్ వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement