క్రైమ్ రివ్యూలో మాట్లాడుతున్న ఎస్పీ అన్నపూర్ణ
అనంతగిరి : నేర నియంత్రణకు ప్రతీ పీఎస్ పరిధిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో.. మంగళవారం తన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పీఎస్‌ల పరిధిలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులను, పీటీ, ఎన్‌బీడ్లు, కంపౌండింగ్ ఈ– పెట్టీ కేసులు, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌పై ఆరా తీశారు.
వీటికి సంబంధించిన అంశాలను అడిగి నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో కేసులను సమీక్షించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్స్, ఎంసీ రిపోర్ట్స్, ఎంవీఐకి సంబంధించి లాంగ్ పెండింగ్ కేసులకు గానూ.. సబ్ డివిజన్ల వారీగా యూఐ మేళాలు నిర్వహించి పరిష్కరించాలని డీఎస్పీలను ఆదేశించారు. మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు 522 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 365 రోజుల పాటు ఇవి పని చేసేలా పర్యవేక్షించాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు రివార్డులు అందజేశారు. డీపీఓ నిర్వహణలో ఏఎస్పీ నర్సింలు, 5ఎస్‌లో వికారాబాద్ డీఎస్పీ శిరీషకు, ఈ పెట్టీ కేసుల్లో తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు ఆయా పీఎస్‌ల పరిధిలో ప్రతిభ కనబర్చిన సీఐలుకు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నర్సింలు, డీఎస్పీలు, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment