![Actress Annapoornas Daughter Commits Suicide - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/28/krithi.jpg.webp?itok=BD7DvT4D)
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ దత్తత కూతురు కీర్తి (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్స్ గోదావరి బ్లాక్‌లో అన్నపూర్ణ ఒక ఫ్లాట్‌లో ఉంటుండగా ఆమె కూతురు ఇంకో ఫ్లాట్‌లో భర్త వెంకటసాయి కృష్ణతో కలసి ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉండగా ఆ చిన్నారికి ఇంకా మాటలు రావడం లేదు. కూతురు విషయంలో కీర్తి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యేది.
కొంతకాలంగా పూర్తిగా డిప్రెష న్‌లోకి వెళ్లింది. గదిలో ఒంటరిగా గడుపుతూ ఏడుస్తూ ఉండేది. వెంకటసాయి శనివారం ఉదయం లేచి చూసే సరికి కీర్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆందోళనకు గురై చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి, కీర్తిని ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్ర మానసిక వేదన తోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అన్నపూర్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న అన్నపూర్ణమ్మ..
అన్నపూర్ణమ్మకు కీర్తి ఒక్కతే కూతురు. మూడున్నరేళ్ల క్రితం కూతురి పెళ్లి చేసి తాను ఉంటున్న అపార్ట్‌మెం ట్‌లోనే మరో ఫ్లాట్‌లో ఉంచింది. ఒక్కగానొక్క కూతురు విగత జీవిగా మారడంతో అన్నపూర్ణ కన్నీరుమున్నీరవు తున్నారు. ఒక్క రోజు కూడా కూతురిని చూడకుండా ఉండలేని అన్నపూర్ణమ్మ కీర్తి లేకపోవడాన్ని తట్టుకోవడం కష్టమేనని చుటు ్టపక్కల వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment