Chinmayi Sripada Interesting Comments On Friendship With Samantha In Latest Interview - Sakshi
Sakshi News home page

Chinmayi: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా

Published Sat, Sep 3 2022 3:49 PM | Last Updated on Sat, Sep 3 2022 5:10 PM

Chinmayi Sripada Interesting Comments On Samantha in latest Interview - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత, గాయనీ చిన్మయి శ్రీపాదలు ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య వారు కలుసుకోవడం లేదని, వారి మధ్య సఖ్యత చెడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చిన్మయి దీనిపై నోరు విప్పారు. తనకు సమంత మంచి స్నేహితులమని, తామిద్దరం కలిసింది లేనిది అందరికి తెలియాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా ‘ఏం మాయ చేశావే’ చిత్రం నుంచి సమంతకు చిన్మయి డబ్బింగ్‌ చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సమంత తన నటన, అందం, అభియనంతో ప్రేక్షకుల ఎంతగా మెప్పించిందో అంతే స్థాయిలో తన వాయిస్‌కి కూడా గుర్తింపు వచ్చింది.

చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. భారీగా నష్టపోయిన మేకర్స్‌

అప్పటి వరకు ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఉన్న చిన్మయి సమంత డబ్బింగ్‌ చెప్పడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక సమంత కారణంగా తెలుగులో చిన్మయికి మంచి గుర్తింపు వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదే విషయాన్ని ఆమె ఇంటర్య్వూలో కూడా చెప్పారు. ఈ సందర్భంగా చిన్మయి మాట్లాడుతూ.. ‘సమంత చాలా మంచి వ్యక్తి. ఆమె వల్లే నాకు తెలుగులో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మించి కెరీర్‌ వచ్చింది. ఇక డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆమెతో నా ప్రయాణంగా ముగిసిందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సమంత తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటుంది. ఇక ఆమెకు నేను డబ్బింగ్‌ చెప్పే అవకాశం రాదేమో’ అని చెప్పకొచ్చారు.

చదవండి: లైగర్‌ ఫ్లాప్‌.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్‌!

ఇక వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తలపై ప్రశ్నించగా.. అందులో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ‘మేమిద్దరం కలిసినప్పుడల్లా ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టకపోయినంత మాత్రాన మేం విడిపోయినట్లు కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. తరచూ మేమిద్దరం కలుసుకుంటాం.. కలిసి పార్టీలు, డిన్నర్లకు వెళుతుంటామని చెప్పడం వల్ల ఎవరికి లాభం. అందుకే మేం కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పం. మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం’ అని ఆమె వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement