Diamond Raja Movie: Hero Nikhil Launched Varun Sandesh Aakashame Nuvvani Song - Sakshi
Sakshi News home page

Diamond Raja Movie Song: హిట్లు, ఫ్లాపులు మాములే: నిఖిల్‌

Published Sun, Aug 7 2022 8:33 AM | Last Updated on Sun, Aug 7 2022 9:51 AM

Hero Nikhil Launched Varun Sandesh Diamond Raja Movie Song - Sakshi

వరుణ్‌ సందేశ్, డాలీషా జంటగా శ్రీనివాస్‌ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైమండ్‌ రాజా’. శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తమటం కుమార్‌ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందించిన ఈ చిత్రం నుంచి ‘ఆకాశమే నువ్వని..’ అంటూ సాగే పాటని నిఖిల్‌ విడుదల చేశారు. 

Aakashame Nuvvani Song Out From Diamond Raja: ‘‘చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు అనేవి సాధారణమే. ఒక్క హిట్టుతో మళ్లీ కమ్‌ బ్యాక్‌ కావొచ్చు. ‘డైమండ్‌ రాజా’ చిత్రంతో వరుణ్‌ సందేశ్‌ కూడా ఇండస్ట్రీని రాక్‌ చేయాలి. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని యంగ్‌ హీరో నిఖిల్‌ పేర్కొన్నారు. వరుణ్‌ సందేశ్, డాలీషా జంటగా శ్రీనివాస్‌ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైమండ్‌ రాజా’. శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తమటం కుమార్‌ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందించిన ఈ చిత్రం నుంచి ‘ఆకాశమే నువ్వని..’ అంటూ సాగే పాటని నిఖిల్‌ విడుదల చేశారు. 

రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని సిద్‌ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో అరెరే, నిజంగా, ఏమంటావే..’ వంటి పాటల తర్వాత ఈ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని..’ పాట కూడా అంతే హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. వినోదాత్మకంగా ఉండే ‘డైమండ్‌ రాజా’ ని ఫ్యామిలీ అంతా కలసి చూడొచ్చు’’ అని తెలిపారు. ‘‘మా సినిమా  విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరోయిన్‌ డాలీషా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పి. రాజశేఖర్‌ రెడ్డి, టి. రమేష్, కెమెరా: వెంకట్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్, పవన్‌ రెడ్డి కోటిరెడ్డి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement