మరోసారి వివాదంలో చిన్మయి! | Chinmayi Reacts After Being Trolled For Her Mother Statement | Sakshi
Sakshi News home page

చిన్మయి తల్లి సంచలన వ్యాఖ్యలు..

Published Wed, Jan 1 2020 8:48 PM | Last Updated on Wed, Jan 1 2020 8:57 PM

Chinmayi Reacts After Being Trolled For Her Mother Statement - Sakshi

గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వివాదంలో నిలిచారు. అయితే ఈ సారి తన వ్యాఖ్యలకు బదులుగా తన తల్లి  మాట్లాడిన తీరుకు వార్తల్లో కెక్కారు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న చిన్మయి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవదాసీ వ్యవస్థను కూల్చివేసిన హేతువాది పెరియర్‌ను తాను ఎప్పటికీ క్షమించనని పేర్కొన్నారు. దీంతో చిన్మయి తల్లి తీరుపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్‌ అకౌంట్‌కు జోడించి దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై స్పందించిన చిన్మయి.. తన తల్లి మాటలకు బాధ్యత వహించనని తెలిపారు. ‘ఆమె మాటలను మీరు వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. ఆమెకు మాట్లాడే హక్కు ఉంది. తన ఉద్దేశాలను నేను తప్పుపట్టాను. సమాధానం చెప్పే సామర్థ్యం తనకు ఉంది’ అంటూ ఘూటుగా స్పందించారు. కాగా చిన్మయి విమర్శల్లో నిలవడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె పోరాటం చేశారు. ఇక కోలీవుడ్‌ ప్రముఖ రచయిత వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కోలీవుడ్‌ డబ్బింగ్‌  అసోషియేషన్ ఆమెపై వేటు కూడా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement