
తమిళ రచయిత నా ముత్తుకుమార్ మృతి
చిన్న వయసులోనే రెండు జాతీయ అవార్డులు సాధించిన తమిళ గేయ రచయిత నా ముత్తుకుమార్(41) ఆదివారం ఉదయం చెన్నైలో మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన జాండీస్తో బాధపడుతున్నారు. దాదాపు 1000కి పైగా పాటలు రాసిన ముత్తుకుమార్ అజిత్ హీరోగా తెరకెక్కిన కిరీడం చిత్రానికి మాటలు కూడా అందించారు.
డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టిన నా ముత్తుకుమార్ సీనియర్ దర్శకులు బాలు మహేంద్రన్ దగ్గర నాలుగేళ్ల పాటు దర్శకత్వ శాఖలో పనిచేశారు.అదే సమయంలో గేయరచయితగా అవకాశాలు రావటంతో దర్శకత్వ ప్రయత్నాలను పక్కన పెట్టి పాటల రచయితగా కొనసాగుతున్నారు. సిల్క్ సిటీ పేరుతో ఓ నవలను కూడా రాసిన ముత్తుకుమార్, తమిళనాట బిజీ గేయరచయితల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమిళ సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.