మహాకవి కలేకూరి ప్రసాద్ (పాత చిత్రం)
మూడు వేల సంవత్సరాల అణచివేతను, అవమానాలను, హింసను భరిస్తూ వున్న జాతి.. మొత్తం ప్రపంచానికి మనుషులుగా బతికే పాఠాలు నేర్పాలి అని చెప్పిన మహాకవి కలేకూరి ప్రసాద్. బహుజనుల బతుకుల్లో వెలుగుల కోసమే బతికాడు. నిరంతరం బహుజనుల కోసమే రాశాడు. కవితైనా పాటైనా, వ్యాసమైనా, అనువాదమైనా, విమర్శయినా తన శైలిలో పాఠకుల బుర్రల్లో ఆలోచనల సెగలు పుట్టిస్తూ, కన్నీటి చుక్కల్లో నుంచి చురకత్తుల వీరులు రావాలనీ దళిత తల్లుల గుండెకోతలు, మంటలు మండే ఆవేదనలే రాశాడు కలేకూరి. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటూ దళిత మ్యానిఫెస్టో కవిత రాసీ దేశ దళితుల గాయాల చరిత్రను, ధిక్కార తిరుగుబాటు కవిత్వంలో రికార్డ్ చేశాడు కంచికచర్ల కోటేశు ఘటన, కీలవేణ్మణి, కారంచేడు, నీరుకొండ, చుండూరు దళితులపై దాడులను మొత్తంగా ఈ కవితలో రాశారు.
కలేకూరి రాసిన ఒక పాట దేశం మొత్తం మార్మోగింది. ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా / విరిసీ విరియని ఓ చిరునవ్వా/కన్నుల ఆశల నీరై కారగ/కట్నపు జ్వాలలో సమిధై పోయావా...’ ఈ పాట తెలియని వారు ఉండరు.ఎక్కడ దళితులపై దాడి జరిగినా తక్షణం స్పందించి పాల్గొంటూ, కవితలు, పాటలు, వ్యాసాలు, ఉపన్యాసాలతో ఆ ఉద్యమపోరాటంలో పాల్గొనేవాడు. అదిగదిగో ఇప్పుడు ‘కలేకూరి ప్రసాద్’ వస్తున్నాడు, ప్రశ్నించడానికీ, ధిక్కరించడానికీ, ‘అదిగదిగో తూర్పున సూర్యుడులా మండుతూ వస్తున్నాడు’ కలేకూరి ‘వస్తున్నాడు’.
(మే 17న కలేకూరి ప్రసాద్ 5వ వర్ధంతి సందర్భంగా, చిలకలూరిపేటలో స్మారక సాహిత్య సభ)
తంగిరాల–సోని, కంచికచర్ల
మొబైల్ : 96766 09234దల
Comments
Please login to add a commentAdd a comment