Indian Film Writer JK Bharavi Reveals About His Financial Struggles - Sakshi
Sakshi News home page

J K Bharavi: ఆ సినిమా వల్లే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను

Published Sat, Feb 5 2022 1:08 PM | Last Updated on Sun, Feb 6 2022 8:47 AM

Film Writer JK Bharavi About His Financial Problems - Sakshi

భక్తి చిత్రాల రచయితగా జేకే భారవి ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనది. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలు తీసిన ఆయన ఒక్క సినిమాతో కుదేలయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కెరీర్‌లో ఎన్నో కార్లు చూసిన నేను ఇప్పుడు బైక్‌ బుక్‌ చేసుకుని ఇంటర్వ్యూకి వచ్చాను. ఎన్నోఏళ్లుగా సంపాదించిందంతా ఒకే ఒక్క సినిమా జగద్గురు ఆదిశంకరతో పోయింది. తెలుగు, కన్నడ భాషల్లో నా కథలు ఓకే అయ్యాయి. కానీ కరోనా వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోంది. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే నాగార్జున నాకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ చేయి చాచి అడగడం నాకిష్టముండదు అని చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement