
సినిమా రంగంలో నిజమైన మిత్రులు కొందరే ఉంటారు. నటుడు గంజాకరుప్పు, గీత రచయిత జయంకొండాన్ ఆ కోవలోకే వస్తారు. గంజాకరుప్పు ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ప్రేక్షకులను నవ్వించడంతోపాటు, కథానాయకుడిగా, నిర్మాతగానూ చిత్రాలు చేశారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు.
20 ఏళ్లుగా మంచి ఫ్రెండ్స్
గీత రచయిత జయంకొండాన్.. వేటప్పన్, ఇంద్రసేనా, ఓడుం మేఘంగళ్, ఒరు సంధిప్పిల్, సొక్కు సుందరం తదితర చిత్రాలకు పాటలను రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలకు గేయరచయితగా పని చేస్తున్న ఈయన స్థానిక కేకే.నగర్‌లో కవింజర్ కిచెన్ పేరుతో హోటల్ నడుపుతున్నారు. గంజాకరుప్పు, జయంకొండాన్‌లు 20 ఏళ్లుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు.
ఫ్రెండ్‌కు పెళ్లి చేసే బాధ్యత కూడా!
తాజాగా గంజాకరుప్పు త్వరలో ఊరంపాక్కమ్‌లో ప్రారంభించనున్న హోటల్ నిర్వహణ బాధ్యతలను గీత రచయిత జయంకొండాన్‌కు అప్పగించనున్నారు. అంతేకాదు ఇంకా అవివాహితుడిగా ఉన్న తన మిత్రుడికి పెళ్లి చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఇందుకోసం డాక్టర్ చదివిన యువతిని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో స్నేహమంటే వీరిదే.. అని కోలీవుడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. కాగా నటుడు గంజాకరుప్పు భార్య కూడా వైద్యురాలు అన్న విషయం తెలిసిందే.
చదవండి: ముగ్గురు కుమార్తెలతో భారమైన జీవితం.. లారెన్స్ సాయం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment