
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గీత రచయిత మెహబూబ్ పాతికేళ్ళ తర్వాత కలిసి పని చేయనున్నారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా ‘హీరో పంతి 2’ అనే సినిమా తెరకెక్కనుంది. 2014లో వచ్చిన ‘హీరో పంతి’ (తెలుగులో వచ్చిన ‘పరుగు’ సినిమాకు హిందీ రీమేక్) సినిమాకు సీక్వెల్‌గా ‘హీరోపంతి 2’ రూపొందుతోంది.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, మెహబూబ్ కలిసి సినిమా చేయనున్నారు. 1995లో వచ్చిన రామ్‌గోపాల్ వర్మ ‘రంగీలా’ సినిమా తర్వాత ఏఆర్ రెహమాన్, మెహబూబ్ కలిసి మళ్లీ ‘హీరో పంతి 2’ సినిమాకు చేస్తున్నారు. కృతీసనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘హీరోపంతి 2’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 3న విడుదల కానుంది.
చదవండి: చారిత్రాత్మక సినిమాలో సూర్య
Comments
Please login to add a commentAdd a comment