దేవీశ్రీ ప్రసాద్‌తో.., గాయని శ్రావణ్‌భార్గవితో ..
నెల్లూరు ,వెంకటగిరి: కళల కాణాచి అయిన వెంకటగిరిలో కళాకారులు, క్రీడాకారులకు కొదవలేదు. ఈ రెండు రంగాల్లోనూ రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. ఏ రంగంపై అయినా మక్కువ, సృజన ఉంటే రాణించవచ్చునని నిరూపిస్తున్నాడు. ఒక్క పక్క గేయ రచయితగా మరో పక్క చెస్ క్రీడాకారులను ఉనత్న స్థాయికి చేర్చేలా వెంకటగిరికి చెందిన నర్రా విజయ్‌కుమార్ అవిరళ కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉపాధ్యాయుడు నర్రా మురళీకృష్ణ, వేదవతి దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌కు చిన్నతనం నుండే చెస్ ఆట అంటే మక్కువ. ఆ రోజుల్లో తన కుటుంబ పరిస్థితుల కారణంగా చెస్ క్రీడలో ఉన్నత స్థాయికి వెళ్లలేకపోయాడు.
చెస్‌లో ప్రావీణ్యం సంపాదించుకుని వెంకటగిరి ప్రాంతంలోని బాల, యువ చెస్ క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లాలనే సంకల్పంతో దాతల సహకారంతో ఉచితంగా నిస్వార్థంగా శిక్షణ ఇస్తున్నాడు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తనవంతు ప్రోత్సాహన్ని అందించేందుకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చెస్ పోటీలను వెంకటగిరిలో నిర్వహిస్తున్నారు. 2019లో జాతీయ స్థాయి చెస్ పోటీలను వెంకటగిరిలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకేసారి 50 మంది చెస్ క్రీడాకారులు ఒక వైపు తను ఒక వైపు ఉండి ఆడి గెలవగల అసమాన నైపుణ్యం కలిగిన విజయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
గీత రచయితగా ప్రస్థానం
విజయ్‌కుమార్ ఓ వైపు చెస్ క్రీడాభివృద్ధికి పాటు పడుతూనే మరో వైపు అతనిలో ఉన్న మరో కోణం గేయ రచయిత గా అడుగులు వేస్తున్నాడు. 2008లో సినీ గేయ రచయితగా సినీ రంగంలో అరంగేట్రం చేసి పదేళ్లలో 9 తెలుగు చలన చిత్రాలకు గేయ రచయితగా, మరో 30 చిత్రాలకు సహాయ రచయితగా పనిచేశారు. పదహారేళ్ల వయసు (కొత్తది) సినిమా గేయ రచయితగా తన మొదటి చిత్రం కాగా ఉదయ్‌కిరణ్ నటించిన చిత్రం చెప్పిన కథ, ప్రేమ ప్రయాణం, శ్రీరంగనాయక వంటి చిత్రాలకు రాసిన పాటలకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. తన తల్లి వేదవతి పేరును తాను రాసిన మొదటి పాటకు పెట్టుకున్నాడు. సినీ రంగంలో ప్రముఖ గీత రచయితలు అయిన భోలేషావలి, కాసర్ల రాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో సినీ కళాకారులు నిర్వహించే కచేరీలు, ఇతర కార్యక్రమాలకు అసిస్టెంట్ ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు సంబంధించి పాటలకు రచయితగా, సహాయ రచయితగా పనిచేశాడు.
అగ్రహీరోల చిత్రాలకు పాటలు రాయడమే ధ్యేయం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రహీరోల చిత్రాలకు గేయ రచయితగా పనిచేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నా. తెలుగు చలన చిత్రగీతాకు మంచి సాహిత్యాన్ని అందించి గేయ రచయితగా గుర్తింపు పొందాలన్నదే సంకల్పం.
Comments
Please login to add a commentAdd a comment