
గీత స్మరణం
పల్లవి
చూద్దాం ఆకసం అంతం... (2)
వేద్దాం అక్కడే పాదం
॥
మళ్లీ పుట్టి మహినే గెలిచి
ఎల్లలు దాటిన యోధా
గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే
గెలుపను దప్పిక ఎప్పుడూ తీరదులే తీరదులే
హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు
హే... మాతృదేశంలో సంతోషం పండించు
చరణం : 1
ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షైపోదాం
మహాశిఖరమే అడ్డొస్తే దాటి మేఘాలౌదాం
అరణ్యమొస్తే గాలైపోదాం
సముద్రమొస్తే చేపైపోదాం
వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం
వెంటేపడుతుంది విజయం విజయం విజయం
లక్ష్యం ఎన్నటికీ దీక్షకి బంధువురా
విజయం ఎప్పటికీ చెమటకి చుట్టమురా
॥
చరణం : 2
మనసు ధనస్సు మాట బాణం
ఎప్పుడైనా తప్పబోదు
కొదమసింహమా గెలిచి పోరాడు పోరాడు...
వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం
వెంటేపడుతుంది విజయం విజయం విజయం
అందరి దీవెనతో ఆయువు పొందానే
మీకే నా బ్రతుకే అంకితమిస్తానే
హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు
హే... మాతృదేశంలో సంతోషం పండించు
॥
చిత్రం : విక్రమ సింహ (2014)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : ఎస్.పి.బాలు, బృందం
- నిర్వహణ: నాగేశ్