
Malaika Arora Slams Trolling On Dating With Arjun Kapoor: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బి-టౌన్‌లో టాక్ కూడా వినిపిస్తోంది. అర్జున్ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. దీంతో వీరిద్దరి రిలేషన్ విషయంలో తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటోంది ఈ జంట. అయినా ఆ రూమార్లను అవాయిడ్ చేస్తు వారి పని వారు చేసుకుంటుపోతున్నారు. అలాగే వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి వారి రిలేషన్, ఏజ్ రిఫరెన్స్‌పై ప్రశ్నలు ఎదురువుతూనే ఉన్నాయి.
చదవండి: అభిమాని ఓవరాక్షన్.. చితక్కొట్టిన మైక్ టైసన్, వీడియో వైరల్
ఆ సమయంలో వాటిని దాటేయకుండ ధీటూగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకాకు మరోసారి దీనిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె అసహనానికి లోనైంది. ఎందుకు అందరు ఈ విషయాన్ని పెద్దదిగా చూస్తున్నారంటూ ట్రోలర్స్‌పై మండిపడింది. ‘మన సమాజంలో వయసులో చిన్న వాడితో డేటింగ్ చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి’ అంటూ సమాధానం ఇచ్చింది.
చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్
అలాగే ‘ధైర్యంగా ఎలా జీవించాలో నేను మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. నాకు నచ్చిన జీవితం జీవించమని నాకేప్పుడు మా అమ్మ చెబుతూ ఉంటుంది. నేను ఒక ఇండిపెండెట్ ఉమెన్‌ని. నా జీవితాన్ని ఎలా జీవించాలనేది నా వ్యక్తిగతం. విడాకులు అనంతరం ప్రతి స్త్రీ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటన్నింటిని అధిమించి మహిళలు ధైర్యంగా జీవించాలి’ అని మలైకా సూచించింది. కాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment