అర్జున్‌ కపూర్‌ బాడీ షేప్‌పై ట్రోల్స్‌, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్‌ | Malaika Arora Response On Trolls Who Criticize Arjun Kapoor Fitness and Body Shape | Sakshi
Sakshi News home page

Arjun Kapoor-Malaika Arora: అర్జున్‌ కపూర్‌ బాడీ షేప్‌పై ట్రోల్స్‌, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్‌

Published Tue, Jun 7 2022 8:43 PM | Last Updated on Tue, Jun 7 2022 9:08 PM

Malaika Arora Response On Trolls Who Criticize Arjun Kapoor Fitness and Body Shape - Sakshi

Malaika Arora Reacts Trolls On Arjun Kapoor Body Shape: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అర్జున్‌ కపూర్‌-మలైకా ఆరోరాలను తరచూ ట్రోలర్స్‌ టార్గెట్‌ చేస్తూనే ఉంటారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం, మలైకా పెళ్లయి విడాకులు కావడంతో వీరిద్దరిపై ట్రోల్స్‌ వస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ లవ్‌బర్డ్స్‌పై విమర్శలు చేశారు ట్రోలర్స్‌. అయితే ప్రతిసారి మలైకాను టార్గెట్‌ చేసే నెటిజన్లు ఈ సారి అర్జున్‌ కపూర్‌పై విమర్శల దాడి చేశారు. ఈ మధ్య కాస్తా బరువెక్కిన అర్జున్‌ ప్రతిరోజు జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల షేర్‌ చేసిన తన వర్కౌట్‌ వీడియో ఓ ఆకతాయి నెటిజన్‌ ఇలా కామెంట్‌ చేశాడు. తన కామెంట్‌లో అర్జున్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ డ్రూ నీల్‌ను ట్యాగ్‌ చేశాడు.

చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్‌

‘ఇలాంటి క్లయింట్‌ ఉండటం మీ అదృష్టం. ఎందుకంటే నిత్యం మీకు డబ్బలు వస్తూనే ఉంటాయి. తరచూ అతను వర్కౌట్స్‌ చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ సరైన షేప్‌ను పొందలేడు’ అంటూ ఓ నెటిజన్‌ అర్జున్‌పై కౌంటర్‌ వేశాడు. ఇది చూసిన అర్జున్‌ ఆ కామెంట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి అతడికి రీకౌంటర్‌ ఇచ్చాడు. ‘ప్రస్తుతం మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఫిట్‌నెస్‌ అంటే బాడీ మీద కట్స్‌ కనిపించడం, సిక్స్‌ ప్యాక్‌తో కూడిన షేప్‌ ఉండటం అనుకుంటున్నారు. ఎలా అంటే ఫేస్‌ లేని బాడీ డీపీలా. కానీ నా దృష్టిలో ఫిట్‌నెస్‌కు అసలు అర్థమేంటంటే ఏ వ్యక్తి అయితే ఎలాంటి చింతలు లేకుండా ప్రతి రోజు సాధారణ ఆరోగ్యకరమైన.. ప్రశాంతమైన జీవితాన్ని జీవించడం.

చదవండి: ‘విక్రమ్‌’ భారీ విజయం, దర్శకుడికి కమల్‌ లగ్జరీ కారు బహుమతి

సైలెంట్‌గా తన జీవితం తాను గడిపేవాడు. తన గురించి తాను మాత్రమే శ్రద్ధ తీసుకునేవాడే ఫిట్‌గా ఉన్నట్లు. అంతేకాని మోహం చాటేసిన డీపీలా ఉండటం కాదు’ అంటూ ఘాటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన అర్జున్‌ ప్రియురాలు, నటి మలైకా అతడికి మద్దతుగా నిలిచింది. అర్జున్‌ ఇన్‌స్టా స్టోరీని స్క్రిన్‌ షాట్‌ తీసి ‘బాగా చెప్పావ్‌ అర్జున్‌. ఇలాంటి విమర్శలు, ట్రోల్స్‌ నీ కాంతిని దూరం చేయకూడదు. నీ ఈ ప్రయాణంలో నీకు మరింత ధైర్యం, శక్తి రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మధ్య మలైకా-అర్జున్‌ల పెళ్లి వార్తలు బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒకటి కానుందని కోద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement