Ranbir Kapoor Gets Trolled After Said He Would Love To Act In Pakistani Films, Deets Inside - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: పాకిస్తాన్‌ సినిమాల్లోనూ నటించేందుకు రెడీ: రణ్‌బీర్‌

Published Tue, Dec 13 2022 4:12 PM | Last Updated on Tue, Dec 13 2022 7:00 PM

Ranbir Kapoor Gets Trolled After Said He Would Love to Act in Pakistani Films - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు. ఓ ఈవెంట్‌లో తన మనసులో మాట బయట పెట్టి ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న రణ్‌బీర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ అవార్డ్‌ ఫంక్షన్లో పాల్గొన్న రణ్‌బీర్‌ అవకాశం వస్తే పాకిస్తాన్‌ సినిమాల్లోనూ నటించేందుకే రెడీ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

చదవండి: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. రజనీకాంత్‌ రికార్డు బ్రేక్‌

వివరాలు.. రీసెంట్‌గా సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌బీర్‌ ఆహ్వానం అందుకున్నాడు. ఈ ఫెస్టివల్లో అతడు ‘వెరైటీ ఇంటర్నేషనల్ వాన్ గార్డ్ యాక్టర్’ అవార్డును అందుకున్నాడు. అనంతరం రణ్‌బీర్‌ అక్కడి మీడియాతో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్డర్‌ రణ్‌బీర్‌ను పాకిస్థాన్ సినిమాల్లో నటిస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి రణ్‌బీర్‌ స్పందిస్తూ ఆసక్తికరంగాసమాధానం ఇచ్చాడు. ‘తప్పకుండ... నా దృష్టిలో కళాకాలరుకు సరిహద్దులు లేవు. ముఖ్యంగా వారి ఆర్ట్‌ విషయంలో. ప్రస్తుతం నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. 

చదవండి: ‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్‌ డైరెక్టర్‌

నాకు ఇక్కడి పరిశ్రమతో పని చేయాలని ఉంది. కుదరితే ఇదే స్టేజ్‌పై ఓ సినిమాకు సైన్‌ చేసేందుకు కూడా రెడీ. అలాగే అవకాశం వస్తే పాకిస్తాన్‌ సినిమాల్లో సైతం నటించేందుకు నేనే  సిద్ధంగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో రణ్‌బీర్‌పై ఇండియన్‌ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆలియా-రణ్‌బీర్‌లు శాశ్వతంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోండి. అక్కడ ప్రశాంతంగా బీఫ్‌ తింటూ పాకిస్తాన్‌ సినీ పరిశ్రమలో పని చేసుకోండి’, ‘శాశ్వతంగా భారత పౌరసత్వాన్ని వదులుకోని పాకిస్తాన్‌లో సెటిలైపోండి.. అందుకు మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది’ అంటూ రణ్‌బీర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement