Anasuya Bharadwaj Reacts On Trolling on Her Valentines Day Post - Sakshi
Sakshi News home page

Anasuya Bhardwaj: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్‌ డే పోస్ట్‌, చెప్పుతో కొడతానంటూ..!

Published Tue, Feb 14 2023 8:14 PM | Last Updated on Tue, Feb 14 2023 9:13 PM

Anasuya Bharadwaj Reacts On Trolling on Her Valentines Day Post - Sakshi

ప్రేమికుల రోజున నటి అనసూయకు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. వాలంటైన్స్‌ డే సందర్భంగా అనసూయ చేసిన స్పెషల్‌ పోస్ట్‌పై సోషల్‌ మీడియాలో రకరకాలు రెస్పాన్స్‌ వస్తోంది. పలువురు క్యూట్‌ కపుల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు.  ప్రేమికుల రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది అనసూయ. ‘నీతో లైఫ్‌ చాలా క్రేజీగా ఉంటుంది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘అదేం లేదు అక్క.. వాడి దగ్గర డబ్బు చాలా ఉంది అందుకే’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇక అతడి కామెంట్‌పై అనసూయ అసహనం వ్యక్తం చేసింది.

దీనిపై స్పందిస్తూ సదరు నెటిజన్‌ను చెప్పుతో కొడతానంటూ చెప్పకనే చెప్పి కౌంటర్‌ ఇచ్చింది. ‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? చెప్పు.. నాకు లేదా మనీ మరి? నీకు అన్ని తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది. చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. సారి అదే చెంపలేస్తానంటున్నా’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇక అనసూయ రెస్పాన్స్‌ రికౌంటర్‌ సదరు నెటిజన్‌ మరో కామెంట్‌ చేశాడు. ‘మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. రియాలిటీని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని చెప్పినా నిజమ నిజమే’ అని అన్నాడు.

దీనిపై కూడా అనసూయ రిప్లై ఇచ్చింది. ‘నీ బొందరా నీ బొంద.. ముందు మాట్లాడటం నేర్చుకో. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నీ బుద్ధి మనీ ఒకటే కాబట్టి.. అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’ అని అంటూ కామెంట్స్‌ చేసింది. ఒకరి కామెంట్‌పై ఒకరు స్పందిస్తూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌, కామెంట్స్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా గతంలోనూ ఇలానే అనసూయ నెటిజన్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ట్విటర్‌లో తనని ట్రోల్‌ చేసిన వారినిక సమాధానం ఇస్తూ ఇలా రెండు, మూడు రోజుల పాటు అనసూయ గొడవ పడింది. అప్పట్లో ఇది చర్చనీయాంశమైంది. అంతేకాదు దనని ట్రోల్‌ చేసిన వారిపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: 
అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ
చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement