వర్షంలో మొక్కకు నీళ్లు పోసిన మేయర్! | Mumbai’s Vasai-Virar Mayor waters plants despite heavy rains | Sakshi
Sakshi News home page

వర్షంలో మొక్కకు నీళ్లు పోసిన మేయర్!

Published Thu, Jul 7 2016 2:22 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

Mumbai’s Vasai-Virar Mayor waters plants despite heavy rains

ముంబై: మొక్కలు నాటాలని.. వాటికి నీళ్లు పోయాలని అనుకోవడం తప్పు కాదు. కానీ, ఒక పక్కన జోరుగా వర్షం పడుతుంటే గొడుగులు వేసుకుని మరీ మొక్కలకు నీళ్లు పోసేవారిని ఏమనాలి? ముంబైలో  ఓ మేయర్ సరిగ్గా ఇలాగే చేశారు. వాసాయ్-విరార్ ప్రాంత మేయర్ ప్రవీణా ఠాకూర్ ఇలా చేయడంతో.. ఆమె కాస్తా సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యారు. వర్షం కురుస్తున్నప్పుడు మొక్కకు నీరుపోస్తున్న ప్రవీణా ఫొటో ఒకటి ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.

వర్షంలో గొడుగులు పట్టుకుని మరీ మొక్కకు నీళ్లు పోస్తున్న ఫొటోను చూసిన ఓ వ్యక్తి దేశం పరిస్థితి ఇలా తయారయిందని ట్వీట్ చేశాడు. కాగా, నగరంలో గ్రీన్ డ్రైవ్ ను చేపట్టినందుకు ప్రవీణాను పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement