Sarkaru Vaari Paata Movie Team Upset With Keerthi Suresh Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthi Suresh: కీర్తిపై అప్‌సెట్‌ అయిన ‘సర్కారు వారి పాట’ టీం, ఆమెకు అది కూడా తెలియదా?

Published Thu, Feb 24 2022 8:52 PM | Last Updated on Fri, Feb 25 2022 2:31 PM

Sarkaru Vaari Paata Movie Team Upset With Keerthi Suresh - Sakshi

Mahesh Babu Sarkaru Vaari Paata Movie: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీలో మహేశ్‌ ఫ్యాన్ష్‌ ఎన్నో అంచాలను పెట్టుకున్నారు. అయితే ఇందులో మహేశ్‌కు జోడిగా కీర్తి సురేశ్‌ను ప్రకటించినప్పటి నుంచి మహేశ్‌ ఫ్యాన్స్‌ నిరాశ భావం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటలో హీరోయిన్‌గా కీర్తి ఉత్తమమైన ఎంపిక కాదని, మహేశ్‌కు ఆమె సరైనా జోడి కాదంటూ నెటిజన్లు మొదటి నుంచి వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. 

ఇక మహేశ్‌ సినిమాను మేలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ వాదనలు మరింత ఎక్కువయ్యాయి. మే నెల మహేశ్‌కు కలిసి రాకపోవడం, పైగా కీర్తి సురేశ్‌ హీరోయిన్‌ కావడంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఎందుకుంటే  ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాల్లో నేను.. శైలజా, మహానటి తప్పా మరే సినిమాలు సక్సెస్‌ కాలేదు. ఇటీవల ఆమె నటించిన పెద్దన్న, గుడ్‌లక్‌ సఖీ, మిస్‌ ఇండియా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పొందాయి. దీంతో కీర్తికి ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారు. ఇదే సర్కారు వారి పాటకు కొనసాగుతుందేనేమోనని భయపడుతున్నారు అభిమానులు.

ఇదిలా ఉంటే ఆమె నటించిన గాంధారి మ్యూజిక్‌ వీడియో రీసెంట్‌గా విడుదలైంది. ఈ మ్యూజిక్‌ వీడియోలో కీర్తి నటించడంపై మహేశ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి కళాకారులు సైతం మంచి విజువల్స్‌తో ఆకట్టుకునే మ్యూజిక్ వీడియోలు చేస్తున్న తరుణంలో కీర్తి ఇలాంటి చెత్త మ్యూజిక్‌ వీడియోలో నటించిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యూజిక్‌ వీడియో సహజంగా లేదని, పేలవంగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందులో ఆమె కాస్ట్యూమ్‌, వీడియో విజువల్స్‌ పేలవంగా ఉన్నాయని, ఈ సాంగ్‌ కాపీ కొట్టినట్లు ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

‘మహేశ్‌ బాబు వంటి స్టార్‌ హీరోతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న క్రమంలో ఆమె ఎంపికల అదే స్దాయిలో ఉండాలని, కానీ ఆమె ఇలాంటి సెకండ్‌ గ్రేడ్‌లో మ్యూజిక్‌లో నటించి తెలివి తక్కువగా వ్యవహరించింది’ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇకనైన ఆమె ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించే వరకు ఇలాంటి మ్యూజిక్‌ చేయద్దని ఆమెకు సూచిస్తున్నారు. ఇక గాంధారీ మ్యూజిక్‌ వీడియోతో ఆమెపై  వస్తున్న నెగిటివిటిని చూసి ‘సర్కారు వారి పాట’ మూవీ టీం సైతం కీర్తిపై అప్‌సెట్‌ అయినట్లు సినీవర్గాల నుంచి సమాచారం. మరి ఈ ట్రోల్స్‌పై కీర్తి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement