Mrunal Thakur Response on Trolls Over Her Comments on Future Husband - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: మేము మనుషులమే.. ట్రోల్స్‌పై ‘సీతారామం’ బ్యూటీ ఆవేదన

Published Sun, Feb 12 2023 4:38 PM | Last Updated on Mon, Feb 13 2023 7:53 AM

Mrunal Thakur Response on Trolls Over Her Comments on Future Husband - Sakshi

‘సీతారామం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. ఈ చిత్రంలో తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమె తెలుగులో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో తాజాగా నాని 30వ చిత్రంలో చాన్స్‌ కొట్టేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ తన కామెంట్స్‌తో నెట్టింట ట్రోల్స్‌కు గురైంది. కాబోయే భర్తపై రెండు విధాలుగా స్పందించి నెటిజన్లు నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

చదవండి: ఓటీటీకి వ‌చ్చేస్తోన్న సుడిగాలి సుధీర్‌ ‘గాలోడు’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

అసలు ఏం జరిగిందంటే.. గతంలో ఓ ఇంటర్య్వూలో మృణాల్‌ కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ.. మంచివాడు అయితే చాలని, అందం అసలు విషయమే కాదని చెప్పింది. ఇక రీసెంట్‌గా ప్రముఖ కామెడీ షో కపిల్‌ శర్మ టాక్‌ షోలో పాల్గొన్న ఆమెకు మరోసారి కాబోయే భర్తపై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి స్పందిస్తూ.. తనకు కాబోయే భర్త అందగాడై ఉండాలని సమాధానం ఇచ్చింది. దీంతో ఒకే ప్రశ్నకు రెండు విధాలుగా స్పందించిన ఆము కామెంట్స్‌ని జత చేస్తూ ఓ నెటిజన్‌ కపటత్వానికి మారు పేరు మృణాల్‌ అంటూ పోస్ట్‌ చేశాడు. దీనిపై మృణాల్‌ అసహనం వ్యక్తం చేసింది.

చదవండి: ఆమిర్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన! ఆయనకు ఏమైంది?

అతడు చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. ‘నాకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంలో ప్రస్తుతం, గతంలో నాకు ఉన్న అభిప్రాయాన్ని నేను ధైర్యంగా చెప్పగలిగాను’’ అని బదులిచ్చింది. దీంతో ఆమె రిప్లైపై కొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇక ఆ కామెంట్స్‌కి విసుగిపోయిన మృణాల్‌.. ‘సెలబ్రెటీలు కూడా మనుషులే అన్న విషయాన్ని వీరు మర్చిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ‘ఇలాంటి వాటికి స్పందించకండి.. మీరు అమేజింగ్‌ పర్సన్‌’ ఆమెకు సపోర్ట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement