Brutal Trolls On Janhvi Kapoor Over Her Comments On Maths, Details Inside - Sakshi
Sakshi News home page

Trolls On Janhvi Kapoor: ఇలాంటి వారి నాలెడ్జ్‌ అలానే ఉంటుంది.. జాన్వీపై ట్రోలింగ్‌

Published Mon, Jul 25 2022 1:49 PM | Last Updated on Mon, Jul 25 2022 3:25 PM

Janhvi Kapoor Brutally Trolled For Comments On Maths - Sakshi

Janhvi Kapoor Comments On Maths: అందాల తార, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ మొదటి సినిమా 'ధడక్‌'తోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది. అలాగే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. పలు కామెంట్స్‌తో ట్రోలింగ్‌ కూడా ఎదుర్కొంది. తాజాగా మరోసారి ట్రోలింగ్‌ బారిన పడింది బ్యూటిఫుల్‌ జాన్వీ కపూర్‌.  

జాన్వీ కపూర్‌ నటించిన లేటేస్ట్‌ మూవీ 'గుడ్‌ లక్‌ జెర్రీ'. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.  ఈ ఇంటర్వ్యూలో మాథ్స్‌పై కామెంట్స్‌ చేసి ట్రోలింగ్‌కు గురైంది. స్కూల్‌లో చదివేటప్పుడు నాకు చరిత్ర, లిటరేచర్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్‌ అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా నాకో విషయం అర్థం కాదు. అదేంటంటే.. కాలిక్యులేటర్‌ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం చాలా సులభమైంది. ఇంకా కష్టపడి ఆల్జీబ్రాను నేర్చుకోవడంలో ఉపయోగమేంటీ? గణితం కోసం ఎందుకు అంతలా తలలు బద్దలు కొట్టుకుంటారో అర్థం కాదు. అయితే చరిత్ర, సాహిత్యం ప్రజల్ని సంస్కారవంతమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. మాథ్స్‌ మిమ్మల్ని నెమ్మదించేలా చేస్తుంది. అని మాట్లాడింది. 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ట్రోలింగ్‌తో జాన్వీని ఆడేసుకుంటున్నారు. 'లక్షల ఫీజు కట్టి ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో చదివిన వారి నాలెడ్జ్‌ ఎలా ఉంటుదనే దానికి ఇదే ఫ్రూఫ్‌', 'మీరు ఉన్న దయనీయ స్థితికి మ్యాథ్స్‌ను ఎందుకు నిందిస్తారు', 'కాలిక్యులేటర్‌తో ఆల్జీబ్రాని చేసేందుకు జాన్వీ కపూర్‌ ప్రయత్నిస్తోంది. ఇక్కడే లాజిక్‌ చచ్చిపోయింది. ఇక ముందుకు సాగండి. ఇంకా ఇలాంటివి చాలా చూడాలి' అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement