Janhvi Kapoor Gets Brutally Trolled for Uncomfortable Gown - Sakshi
Sakshi News home page

ఉర్ఫీ జావెద్‌ను ఫాలో అవుతున్నారా?.. జాన్వీ కపూర్‌పై నెటిజన్స్ ట్రోల్స్!

Published Sat, Apr 8 2023 7:35 PM | Last Updated on Sat, Apr 8 2023 7:49 PM

Janhvi Kapoor gets brutally TROLLED for uncomfortable gown  - Sakshi

బాలీవుడ్ భామ జాన్వీకపూర్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. 2018లో దఢక్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ ఎంట్రీకి కూడా సిద్ధమైంది జాన్వీ కపూర్. తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో మెరిసింది భామ. జాన్వీ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టింది. 

ఈ ఫంక్షన్‌లో వెరైటీ డ్రెస్‌లో కనిపిస్తూ సందడి చేసింది. అయితే ఆ డ్రెస్సులో వేదికపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. జాన్వీ పసుపు రంగు కటౌట్ గౌను ధరించిన వేదికపై ఫోటోలకు ఫోజులివ్వగా.. ఆ దుస్తుల్లో చాలా అసౌకర్యంగా కనిపించింది. దీంతో నెటిజన్స్ జాన్వీ కపూర్‌ డ్రెస్‌పై దారుణంగా ట్రోల్స్ చేశారు. మీరు ఎందుకు వెస్టర్న్ కల్చర్‌ను కాపీ కొడుతున్నారు అని ప్రశ్నించారు. మరొ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీరంతా ఉర్ఫీ జావెద్‌ను అంటారు.. మళ్లీ బాలీవుడ్ మొత్తం ఆమెనే ఫాలో అవుతారు అంటూ కామెంట్ చేశారు. జాన్వీ డ్రెస్ టెంట్‌ వేసుకునే పరదాలా ఉందని ఫన్నీ కామెంట్ చేశాడు. 

(ఇది చదవండి: పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి)

కాగా.. జాన్వీ తదుపరి చిత్రం వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్‌లో తమ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ కోసం శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. జాన్వీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement