'It Really Hurts', says Janhvi Kapoor on being called 'Nepotism Ki Bachchi' - Sakshi
Sakshi News home page

Janhvi kapoor: అలా నన్ను పిలిచినప్పుడల్లా చాలా బాధేస్తుంది: జాన్వీ కపూర్‌ ఆవేదన

Published Thu, Feb 9 2023 4:47 PM | Last Updated on Thu, Feb 9 2023 5:40 PM

Janhvi Kapoor Said She Really Hurts When Called Her Nepotism Kid - Sakshi

అతిలోకి సుందరి, దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. స్టార్‌ కిడ్‌ అయినప్పుటికీ తరచూ విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నా జాన్వీ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ మాట్లాడుతూ.. తనపై వచ్చే ట్రోల్స్ చూసి విసిగిపోయానంది. ఎంత కష్టపడినా అందులో తప్పులు వెతుకుతూ విమర్శిస్తూనే ఉంటారని వాపోయింది. ‘మనం ఏం చేసిన, ఎంత కష్టపడినా కొందరు అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు.

చదవండి: సరిగమప విన్నర్‌ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ

మనల్ని ఎంతగా ట్రోల్‌ చేస్తే వారికి అంత సంతోషం. విమర్శించడంలో వారు ఆనందం పొందుతారు. దాంతో వారు మనపై చేసే కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తారు. ఇది నిరంతరం కొనసాగతూనే ఉంటుంది. కానీ ఇలాంటి వార్తలు చదివి, చదివి కొంతకాలానికి ప్రజలు విసిగిపోతారు. దురదృష్టం ఏంటంటే మనపై వచ్చే ట్రోల్స్‌ కూడా ప్రజలను విసిగిపోయేలా చేస్తాయి’ అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే ‘నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నెపోకిడ్‌ అంటూ కొందరు నన్ను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. 

చదవండి: హైటెక్‌ సిటీ ఆఫీసులో మహేశ్‌ బాబు .. వీడియో వైరల్‌

నా సినిమా రిలీజైనప్పుడల్లా ‘నెపోకిడ్‌.. నటన రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావు?’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. వాటిని చూసి నేనెంతో బాధపడ్డా. అయితే, ఇప్పుడు సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌ చూసి నవ్వుకుంటున్నా. నా బలాలు, బలహీనతలు, నేను ఎలా నటిస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి, వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోకూడదని అర్థమైంది. అలాగే ఇటీవల నేను చేసిన చిత్రాలతో నటిగా నన్ను నేను నిరుపించుకున్నాను అనుకుంటున్నా. నాకు కూడా అవకాశాలు వస్తాయని అనిపిస్తొంది’ అని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement