మలైకా అరోరా బాలీవుడ్‌లో ఫేమ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. నటనతోనే కాకుండా ఫ్యాషన్, ఫిట్‌నెస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందుకే 47 ఏళ్ల ఈ మోడల్‌ని టిన్సెల్ టౌన్ ‘యమ్మీ మమ్మీ’ అని పిలుచుకుంటుంటారు ఫ్యాన్స్. జిమ్ చేయడం నుంచి బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో బయటికి వెళ్లిన విషయాన్ని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. అయితే ఇటీవల యోగా క్లాసెస్‌కి వెళ్లిన సమయంలో వాకింగ్ స్టైల్ గురించి ఈ భామని విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.
మలైకా క్రమం తప్పకుండా యోగా క్లాసెస్‌కి వెళుతుంటుంది. తాజాగా ముంబైలోని ఓ యోగా సెంటర్‌కి అలా వెళ్లిన క్రమంలో ఆమె నడిచిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇదేం స్టైల్ బై..’ అని ఒక నెటిజన్ అనగా, మరొకరు ఈ భామ ‘ఇండియాస్ నెక్స్ట్ సూపర్ మోడల్’ షోకి జడ్డిగా చేయనుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కొందరు ఈ బ్యూటీ నడకను బాతు నడకతో పొల్చుతుండగా, మరికొందరు విచిత్రంగా నడుస్తోందంటూ విమర్శిస్తున్నారు.
చదవండి: ప్రియుడికి మలైక స్పెషల్ బర్త్‌డే విషెస్
పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ ‘కెవ్వు కేక’తో మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకి సువరిచితురాలే. కాగా ప్రస్తుతం మిలింద్ సోమన్, అనూష దండేకర్‌తో కలిసి ఎమ్‌టీవీలో వచ్చే ‘సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ సీజన్ 2’కి జడ్డిగా వ్యవహరిస్తోంది. స్టార్ వర్సెస్ ఫుడ్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలతో పాటు నెట్‌ఫ్లిక్స్ షో, ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment