![Nagababu Trolled Over AP Roads Situation Social Media - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/18/Naga-Babu.jpg.webp?itok=oSM5ayIR)
సాక్షి, తూర్పు గోదావరి: సినీ నిర్మాతగానే కాదు.. రాజకీయాల్లోనూ కొణిదెల నాగబాబు చేదు అనుభవాల్నే చవిచూస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ హోదాలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించబోయి.. చేసిన ఓ ఫ్లాప్ షో చివరకు ఆయన్ను నవ్వులపాలు చేసింది.
రాజమహేంద్రవరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ ఆయన శనివారం ఉదయం హడావుడి చేశారు. గోతులు పడిన ఓ రోడ్డు వద్ద ‘గుడ్‌మార్నింగ్ సీఎం సార్’ అంటూ ఫొటోకు పోజు ఇచ్చారు. అయితే..
వాస్తవానికి ఆ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే శాఖ పరిధిలోని బొగ్గు డంపింగ్ యార్డుకు వెళ్లే దారి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా అభాసుపాలు చేసేందుకు చేసిన ప్రయత్నం చివరకు ఆయనకే బెడిసి కొట్టింది. సోషల్ మీడియాలో నాగబాబు ఫ్లాప్‌షో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment