
సౌత్ స్టార్ హీరోయిన్ మళవిక మోహన్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇతడితోనే ప్రేమలో ఉన్నానంటూ వాలంటైన్స్ డేకు ఆమె షేర్ చేసిన వీడియోపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ పరిచయం చేస్తానని చెప్పి నువ్వు చేసేది ఇదా అంటూ నెటిజన్లు ఆమెను వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటేజ.. సోమవారం ప్రేమికుల రోజు సందర్భంగా మాళవిక ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె ఎమోషనల్ వర్డ్స్‌తో తన ప్రేమను పరిచయం చేస్తున్నట్లు బాగా ఓవరాక్షన్ ఇచ్చింది. తీరా చూస్తే అది తను చేసిన కమర్షియల్ యాడ్. స్కోడా స్లావియా కారును ప్రమోట్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేసింది.
చదవండి: ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే: నటుడు నరేష్
నిజంగానే తన ప్రియుడిని చూపిస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చేసిన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతినెలా ఉంది ఈ వీడియో. దీంతో దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మాళవికపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమోషన్స్ ఆడుకోకు, వావ్ ఈ బాయ్ ఫ్రెండ్ సూపర్, మోస్టియెంట్ హ్యాండ్స్‌మ్ అంటూ ఆమె పోస్ట్‌పై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల మళవిక.. త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పాస్తానంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా తన వీడియోకు మిలియన్ వ్యూస్ రావాలని ఆమె కండిషన్ పెట్టింది.
చదవండి: బర్త్‌డే స్పెషల్: నటి మీరా జాస్మిన్ ఇప్పుడేం చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment