Netizens Trolls On Aishwarya Rai Silver Gown In Cannes Film Festival 2023, Deets Inside - Sakshi
Sakshi News home page

Aishwarya Rai- Urvashi Rautela: కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్, ఊర్వశి.. నెటిజన్స్ ట్రోల్స్‌!

Published Fri, May 19 2023 5:09 PM | Last Updated on Fri, May 19 2023 5:59 PM

Netizens Trolls On Aishwarya Rai Silver Gown In Cannes Film Festival - Sakshi

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఆమె ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఈ వేడుకల్లో సినీతారలు ప్రత్యేక దుస్తుల్లో తళుక్కున్న మెరిశారు. ఐశ్వర్యారాయ్‌తో పాటు మరో నటి ఊర్వశి రౌతేలా సైతం రెడ్ కార్పెట్‌లో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించింది. అయితే ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్)

 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఈ మాజీ ప్రపంచ సుందరి వెండి గౌన్‌లో తళుక్కున మెరిసింది. ఆమె ధరించిన ఈ వెండి డ్రెస్‌పై కొందరు నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. మీరు డిజైనర్‌ను మార్చండి అంటూ కొందరు కామెం‍ట్స్ చేయగా..  వెండి హుడీ ఏంటి విడ్డూరంగా అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఫ్యాషన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ ఐశ్వర్యారాయ్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

(ఇది చదవండి: బాలీవుడ్‌ హీరో ఇం‍ట్లో తీవ్ర విషాదం..!)

ఇక మరోవైపు నిన్న ఊర్వశి రౌతేలా ధరించిన నెక్లెస్‌పై కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  పింక్‌ కలర్‌ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా వచ్చిన ఊర్వశి.. మెడలో మాత్రం మొసలి డిజైన్‌తో తయారు చేసిన నెక్లెస్‌ను ధరించింది. చెవి రింగులు కూడా అలాంటివే పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ‘ఆ నెక్లెస్‌ కిందపడితే నిజంగా మొసలి అనుకొని భయపడతారేమో జాగ్రత్త అని కామెంట్స్‌ చేశారు. బ్లూ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్న ఊర్వశి వేదికపై ప్రత్యేక ఆకర‍్షణగా నిలిచింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement