Netizens Trolls On Ashu Reddy Over Her Latest Instagram Video, Goes Viral - Sakshi
Sakshi News home page

Trolls On Ashu Reddy: రెచ్చిపోయిన నెటిజన్లు, అషూ రెడ్డిపై దారుణమైన ట్రోల్స్‌

Published Fri, May 27 2022 6:22 PM | Last Updated on Fri, May 27 2022 6:54 PM

Netizens Trolled On Ashu Reddy Over Her Latest Instagram Video - Sakshi

అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్‌ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్‌టాక్‌ వీడియోస్‌తో జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ 3 ఆఫర్‌ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్‌ అయిన అషూ రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలోను అడుగుపెట్టింది.

చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్‌ ఏమన్నదంటే..

ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది అషూ. అప్పటి నుంచి హాట్‌హాట్‌ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ సహా కంటెస్టెంట్‌ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌పై రీల్‌ చేసింది అషూ. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?’ అని చెబుతుంది.

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసిన హాలీవుడ్‌ మూవీ రైటర్‌, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ డైలాగ్‌ విని పక్కనే ఉన్న అజయ్‌ అషూ తలపై ఒకట్టిస్తాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘మీ మనసులోని మాటను కామెంట్‌ చేయండి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా వారి మనసులో మాటను బయటపెడుతూ అషూను దారుణంగగా ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ‘ముందు మేకప్‌ తీసి రీల్‌ చేయ్‌ గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు’, ‘ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్‌ చేయ్‌’, ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే’ అంటూ దారుణంగా నెటిజన్లు దారుణంగా ల్రోల్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement