
ముంబై : బిగ్‌స్ర్కీన్‌కు విరామం ఇస్తూ తనకిష్టమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్న అభిషేక్ బచ్చన్ ఎక్కువసమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు. జూనియర్ బచ్చన్ ఇటీవల ట్విటర్‌లో చేసిన పోస్ట్‌పై ఓ నెటిజన్ ఆయనను ట్రోల్ చేయగా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి ఆకట్టుకున్నారు. తనపై వచ్చిన ట్రోల్‌ను హుందాగా స్వీకరిస్తూ జూనియర్ బచ్చన్ ఇచ్చిన సమాధానం గొప్పగా ఉందనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక లక్ష్యం..ఆశయంతో పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని ఓ కోట్‌ను అభిషేక్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ జూనియర్ బచన్‌ను నిరుద్యోగిగా పేర్కొంటూ కామెంట్ చేశారు.
ఓ వ్యక్తి సోమవారం కూడా విశ్రాంతి తీసుకుంటే అతడిని నిరుద్యోగి అనే పిలుస్తారని కామెంట్ చేశారు. దీనికి బదులిచ్చిన అభిషేక్..‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను.. కొందరు వారు ఏ పనిచేసినా దాన్ని ప్రేమిస్తార’ని హుందాగా స్పందించారు. ఇక తన తదుపరి చిత్రంలో అనురాగ్ బసు నిర్ధేశకత్వంలో అభిషేక్ వెండితెరపై సందడి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment