
కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈమూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను కాస్తా ఆసక్తికరంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.
గతంలో వీవీఐటీ గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడిన మూవీ టీం ఇందులో గెలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పోందుకున్న ప్లేయర్‌తో ఆ సినిమాలోని సెకండ్ సింగిల్‌ను లాంచ్ చేయించారు. ఇప్పుడు మరో సరికొత్త ఈవెంట్‌కు ప్లాన్ చేశారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరంగల్‌లోని కే స్ట్రీట్‌లో ఈ మూవీ టీం ఒక బ్రేకప్ పార్టీని సెలెబ్రేట్ చేయనుంది. జనవరి 29న నిర్వహించే ఈ బ్రేకప్ పార్టీకి నిర్మాత బన్నీ వాసు, హీరో కిరణ్ అబ్బవరం హాజరు కానున్నారు. ఏదేమైనా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లడానికి విభిన్న తరహాలో ప్రొమోషన్స్ నిర్వహిస్తూ చిత్రం బృందం మూవీ హైప్ క్రియేట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment