వాలంటైన్స్‌ డే స్పెషల్‌: వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్‌ ట్రాక్‌ | Oh Bangaram Video Song Release From Vinaro Bhagyamu Vishnu Katha | Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha: వాలంటైన్స్‌ డే స్పెషల్‌: వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్‌ ట్రాక్‌

Published Tue, Feb 14 2023 9:14 PM | Last Updated on Tue, Feb 14 2023 9:14 PM

Oh Bangaram Video Song Release From Vinaro Bhagyamu Vishnu Katha - Sakshi

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. 

 ఇవాళ(ఫిబ్రవరి 14న)'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ సినిమా నుంచి లవ్‌ట్రాక్‌ను రిలీజ్‌ చేసింది చిత్రం బృందం. 'ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే..’ అంటూ సాగే ఈ పాటకు సాగుతోంది. హీరోయిన్‌ వెంట పడుతూ హీరో పాడే పాట ఇది.  చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా ఈ చిత్రంలో మురళీశర్మ, శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement