లక్షల జనం | abundant devotees to Holy baths | Sakshi
Sakshi News home page

లక్షల జనం

Published Fri, Aug 19 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

బీచుపల్లిలో కష్ణమ్మకు హారతి ఇస్తున్న కలెక్టర్‌ శ్రీదేవి

బీచుపల్లిలో కష్ణమ్మకు హారతి ఇస్తున్న కలెక్టర్‌ శ్రీదేవి

  • పలు పుష్కర ఘాట్లలో సినీనటుల సందడి
  • సోమశిలలో బాలకష్ణ పుణ్యస్నానం.. పిండప్రదానం
  • రంగాపూర్‌లో ఉపాసన, బీచుపల్లిలో అశోక్‌కుమార్‌ పుణ్యస్నానాలు
  • ఘాట్ల వద్ద వెల్లివిరిసిన రక్షాబందన్‌
  • పుష్కరస్నానం ఆచరించి సోదరులకు రాఖీలు కట్టిన సోదరిమణులు
  • డీఐజీ అకున్‌ సబర్వాల్‌కు రాఖీ కట్టిన ఎస్పీ, విద్యార్థులు
  • సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కష్ణ పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏడో రోజూ భక్తులు పోటెత్తారు. రక్షా బంధన్‌ సెలవు దినం కావడం.. పుష్కరాల ముగింపు 5 రోజులే మిగిలి ఉండడంతో కొంత రద్దీ పెరిగింది. ఘాట్లలో జనం కిటకిటలాడారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 12.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించినట్లు అధికారులు తెలిపారు. గొందిమళ్ల, సోమశిల, బీచుపల్లి, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు వరుసగా భక్తులతో పోటెత్తాయి. జూరాల ఘాట్‌లో నీళ్లు లేకపోవడంతో వరుసగా మూడోరోజు మూసివేశారు. జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు తగ్గడంతో ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేయడాన్ని అధికారులు నియంత్రించారు. దీంతో పలు పుష్కరఘాట్లలో నీరు కొంత మేర తగ్గింది. అయితే పుష్కరాలు పూర్తయ్యేంత వరకు భక్తుల పుణ్యస్నానాలకు నీటి ఇబ్బంది ఉండబోదని అధికారులు చెబుతున్నారు.
     
    ఘాట్లలో రక్షాబంధన్‌
    గురువారం రక్షా బంధన్‌ కావడంతో పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం చేసిన భక్తులు తమ సోదరిమణులతో రక్షా బంధనం కట్టించుకున్నారు. హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ అకున్‌ సబర్వాల్‌కు ఎస్పీ రెమా రాజేశ్వరి రంగాపూర్‌ ఘాట్‌లో రాఖీకట్టారు. పలువురు విద్యార్థులు డీఐజీకి రక్షా బంధనం కట్టారు. దీనికి డీఐజీ స్పందిస్తూ తనకు ఈ రక్షా బంధనం ఎస్పీతో సహా ఆరుగురు సోదరిమణులను ఇచ్చిందని అన్నారు. తనకు రక్షాబంధనం కట్టిన విద్యార్థులకు తన ఫోన్‌నంబర్‌ ఇవ్వడమే కాకుండా వారి నుంచి ఫోన్‌నంబర్లు తీసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు తనను కలవొచ్చని ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని రాఖీ కట్టిన విద్యార్థినులకు చెప్పారు. పలువురు పోలీసులకు మహిళా పోలీసులు రాఖీలు కట్టారు. వివిధ శాఖల సిబ్బందికి కూడా రక్షాబంధన్‌ కట్టారు. 
     
    పుష్కరస్నానం ఆచరించి పిండప్రదానం చేసిన హీరో బాలకష్ణ
    మరోవైపు వివిధ పుష్కర ఘాట్‌లలో ప్రముఖ సినీ నటులు పుణ్యస్నానాలు ఆచరించారు. నందమూరి బాలకష్ణ సోమశిల పుష్కరఘాట్‌లో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తండ్రి ఎన్‌టీ రామారావు, తల్లి బసవతారకమ్మలకు పిండ ప్రదానం చేశారు. బాలకష్ణతో పాటు ఆయన సోదరిమణులు, కుటుంబీకులు, బంధువులు పాల్గొన్నారు. తొలుత కొల్లాపూర్‌ చేరుకున్న బాలకష్ణను రాష్ట్ర మంత్రి జూపల్లి కష్ణారావు కలిశారు. కేఎల్‌ఐ అతిథి భవనంలో జూపల్లి కష్ణారావు అల్పాహార విందులో బాలకష్ణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బాలకష్ణ కొల్లాపూర్‌ వస్తున్న విషయంపై సమాచారం లేకపోవడంతో పలువురు నేతలు విషయాన్ని బాలకష్ణ దష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన బాల కష్ణ అల్పాహారం కాగానే పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమం పెట్టుకోమని సూచించడంతో కొల్లాపూర్‌ పట్టణంలోని ఎన్‌టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసేందుకు పార్టీ నేతలు ఆహ్వానించారు. దీంతో బాలకష్ణ ఎన్‌టి రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలు బాలకష్ణకు రాఖీ కట్టారు. అనంతరం అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని బాలకష్ణ కుటుంబసమేతంగా సందర్శించారు.
     
    ప్రముఖుల సందడి..
    రంగాపూర్‌ పుష్కరఘాట్‌లో ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పుణ్యస్నానమాచరించారు. 
    బీచుపల్లి పుష్కరఘాట్‌లో సినీ నిర్మాత అశోక్‌కుమార్‌ పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు విచ్చేసే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని పుష్కర ఏర్పాట్లు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయని ఇందు వల్ల భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు కలుగుతున్నాయని అన్నారు. 
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement