holy baths
-
కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళా
మైసూరు: కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, సాధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి బదులుగా కర్ణాటకలో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని భక్తులను కోరారు. ‘‘త్రివేణి సంగమంలో భాగమైన గంగా, యమున, సరస్వతి నదులకు ఎలాగైనా దైవత్వం, స్వచ్ఛత ఆపాదించారో కావేరి నదికి సైతం అంతే ప్రాశస్త్యం ఉందని మన పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు వెళ్లి అక్కడ కిక్కిరిసన జనం మధ్య ఇబ్బందులు పడే బదులు కర్ణాటకలో దక్షిణభారత ప్రయాగ్‌రాజ్‌గా వినతికెక్కిన టి.నరసిపుర త్రివేణి సంగమ స్థలికి విచ్చేయండి. పుణ్యస్నానాలు ఆచరించండి. అత్యంత పటిష్టవంతంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఇక్కడ కుంభమేళాకు ఏర్పాట్లుచేశాం’’అని భక్తులకు శివకుమార్ పిలుపునిచ్చారు. -
మేళా కిటకిట
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. -
Maha Kumbh Mela 2025: మహా విషాదం
తెల్లవారుజామున మూడు గంటల సమయం.. బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు చేసేందుకు ‘సంగమ్ నోస్’ ఘాట్ వద్ద వేచిచూస్తున్న లక్షలాది మంది భక్తులు.. ఒక్కసారిగా బారికేడ్లకు అటువైపు పెరిగిన భక్తుల రద్దీ.. వారంతా పక్కన కూర్చున్న వారిపై పడటంతో అంతా హాహాకారాలు.. ఏం జరిగిందో తెలియని పరిస్థితి.. పోలీసులు కిందపడినపోయిన 90 మందిని తాత్కాలిక సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో 30 మంది ప్రాణాలు వదిలారు. 60 మంది గాయపడ్డారు. అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటకు బలవటం విషాదాన్ని మిగిల్చింది. స్నానఘట్టాల్లో భక్తకోటి శరణుఘోషకు బదులు మృత్యుఘోష వినిపించింది. మహాకుంభ్ నగర్: అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మహాకుంభమేళాకు వచ్చిన కొందరు భక్తులు అనూహ్యంగా జరిగిన తొక్కిసలాట(stampede)కు బలయ్యారు. గత కొద్దిరోజులుగా అశేష జనవాహినితో జనసంద్రమైన ప్రయాగ్‌రాజ్(Prayagraj) మహాకుంభమేళా(Maha Kumbh Mela) స్నానఘట్టంతో భక్తకోటి శరణఘోషకు బదులు మరణమృదంగం వినిపించింది. మంగళవారం అర్ధరాత్రిదాటాక 1–2 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమ స్థలి సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. దీంతో కొద్దిసేపు పుణ్యస్నానాల క్రతువును మధ్యాహ్నందాకా ఆపేశారు. మృతుల్లో కర్ణాటక, అస్సాం, గుజరాత్ నుంచి వచ్చిన భక్తులున్నారు. మౌని అమావాస్య రోజు ఒక్కరోజే 10 కోట్లమంది భక్తులు రావొచ్చన్న ముందస్తు అంచనాతో యోగి ఆద్యిత్యనాథ్ ప్రభుత్వం అత్యంత పటిష్ట ఏర్పాట్లుచేసినా అపశృతి చోటుచేసుకోవడంతో అక్కడ అంతా విషాదం అలుముకుంది. 30 మంది మృతుల్లో 25 మందిని గుర్తించారు. వారిలో నలుగురు కర్ణాటక వాసులున్నారు. అస్సాం, గుజరాత్ నుంచి చెరో భక్తుడిని గుర్తించారు. గాయపడిన వారిలో 36 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. మిగతా వారిని డిశ్చార్జ్‌చేశారు.అంతా గందరగోళం, హాహాకారాలుతెల్లవారుజామున మూడుగంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయడానికి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమ స్థలిలోని సంగమ్ నోస్ ఘాట్ వద్ద కూర్చుని వేచి చూస్తుండగా ఒంటిగంట దాటాక బ్యారీకేడ్లకు అటువైపుగా ఉన్న భక్తులు కిటకిట ఎక్కువ కావడంతో ఇటువైపు దూకారు. ఎక్కివస్తున్న, నెడుతున్న జనం ధాటికి బ్యారీకేడ్లు విరిగిపోయాయి. దీంతో కూర్చున్న వారిపై అటువైపు నిల్చున్న భక్తులు పడ్డారు. వారిపై పక్కనున్న వాళ్లు పడటంతో కిందనున్న వాళ్లు ఊపిరాడక చనిపోయారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంచేసినా కోట్లాది జనం కావడంతో అది వెంటనే సాధ్యపడలేదు. కిందపడిన దాదాపు 90 మంది భక్తులను పోలీసులు ఆ జనం మధ్యే భుజాలపై ఎత్తుకుని, అంబులెన్సుల్లోకి ఎక్కించి మేళా ప్రాంగణంలోనే ఏర్పాటుచేసిన తాత్కాలిక సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. అయినాసరే వారిలో 30 మంది చనిపోయారని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ ప్రకటించారు. తొక్కిసలాట కారణంగా వెంటనే పుణ్నస్నానాలను పోలీసులు, సహాయక సిబ్బంది ఆపేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక మధ్యాహ్నం రెండున్నర గంటలకు 13 అఖాడాల అమృత్ స్నాన్తోపాటు భక్తుల పుణ్యస్నానాలకు అనుమతి ఇచ్చారు.జనం మధ్య చిక్కుకున్న అంబులెన్సులుభయంతో భక్తులు చిందరవందరగా పరుగెత్తడంతో బ్యాగులను వెంటేసుకొచ్చిన కొందరు వాటిని అక్కడే పడేశారు. అవి తగిలి ఇంకొందరు పడ్డారు. చెత్త కోసం ఏర్పాటుచేసిన ఇనుప చెత్త డబ్బాలు తగిలి చాలా మంది పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తొక్కిసలాటలో కిందపడి స్పృహకోల్పోయిన భక్తులను వెంటనే అంబులెన్సుల్లో ఎక్కించినా జనం మధ్యలో ముందుకు కదల్లేక అవి చాలాసేపు అక్కడే ఆగిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు వాటికి దారి కల్పించారు. వీఐపీల కోసం కొంత మేర స్థలాన్ని వదిలేయడంతో పక్కన రద్దీ పెరుగుతోంది. ఇకపై వీఐపీ ప్రోటోకాల్ పేరిట జనాన్ని పక్కకు నెట్టేసే విధానాన్ని పాటించబోమని అక్కడి అధికారి ఒకరు చెప్పారు. సాధారణ భక్తులు, అఖాడాల కోసం వేర్వేరుగా ఏర్పాటుచేసిన వరసలు, బ్యారీకేడ్ల వద్ద ఘటన జరిగిందని అధికారి పేర్కొన్నారు. కుప్పలుగా భక్తుల దుస్తులు, దుప్పట్లు, బ్యాగులు, చెప్పులు పడి తొక్కిసలాట ప్రాంతం చిందరవందరగా తయారైంది. స్పృహ కోల్పోయిన తమ వారిని తట్టిలేపేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులతో ఆప్రాంతంలో ఒక్కసారిగా నిర్వేదం నెలకొంది. ‘‘ కర్ణాటక నుంచి మేం 60 మంది బృందంగా వచ్చాం. అన్ని వైపుల నుంచి తోశారు. తప్పించుకునే ఆస్కారం లేకుండాపోయింది’’ అని కర్ణాటక నుంచి వచ్చిన సరోజిని అనే భక్తురాలు ఏడుస్తూ చెప్పారు. ‘‘ బ్రహ్మముహూర్తంలో స్నానం చేద్దామని కూర్చుని, పడుకుని వేచిచూస్తున్న వారిపైకి వెనక నుంచి ఒక్కసారిగా జనం మీదపడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది’’ అని అస్సాం నుంచి వచ్చిన బాదామా దేవి చెప్పారు. ఇలా జరగాలని గంగమ్మ తలచిందేమో అని జార్ఖండ్‌లోని పలాము నుంచి వచ్చిన రామ్ సుమిరాన్ అనే భక్తుడు అన్నాడు. తొక్కిసలాటకు ముందే ఏదైనా ఉపద్రవం జరగొచ్చని ఊహించిన ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘాట్ వద్ద కూర్చుని వేచిచూస్తున్న భక్తులకు ఆయన ‘‘ లేవండి. లేవండి. త్వరగా స్నానంచేసి వెళ్లపొండి. వెనక నుంచి ఊహించనంత మంది జనం వచ్చేస్తున్నారు’’ అని ఆయన అక్కడి భక్తులకు ముందే హెచ్చరిస్తుండటం ఆ వీడియోలో ఉంది. ‘‘ భక్తుల్లో పోకిరీలూ ఉన్నారు. చిన్నారులు ఉన్నారన్న ఇంగితజ్ఞానం లేకుండా నవ్వుతూ మమ్మల్ని తోసేశారు. తొక్కిసలాటలో మా పిల్లలు గాయపడ్డారు’’ అని ఆస్పత్రిలో ఉన్న ఒక మహిళ తెలిపింది. విచారం వ్యక్తం చేసిన ప్రముఖులుఘటన జరిగిన విషయం తెల్సి వెంటనే ప్రధాని మోదీ సీఎం యోగికి ఉదయం, మధ్యాహ్నం నాలుగైదు సార్లు ఫోన్‌చేసి తాజా పరిస్థితిపై వాకబు చేశారు. భక్తుల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’’ అని మోదీ అన్నారు. రాష్ట్రపతి ముర్ము సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బుధవారం ఒక్కరోజే 7.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో బుధవారమే దాదాపు 10 కోట్ల మంది జనం వచ్చేశారని వారు బయటికెళ్లేదాకా కొత్తవారిని అనుమతించొద్దని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. సంగమ్ నోస్ ఘాట్ వైపు వెళ్లొద్దని భక్తులకు యోగి విజ్ఞప్తిచేశారు. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాలను మూసేసినట్లు తెలుస్తోంది. వెనక్కి వచ్చే భక్తుల కోసం రైల్వేశాఖ అదనపు రైళ్లను నడపనుంది.ముగ్గురు సభ్యులతో జుడీషియల్ కమిషన్ఘటనకు కారణాలను తెల్సుకునేందుకు జస్టిస్ హార్ష్ కుమార్, మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ వీకే సింగ్‌లతో యోగి ప్రభుత్వం ఒక జుడీషయల్ కమిషన్‌ను నియమించింది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి తలో రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఘటనాస్థలికి వచ్చి సమీక్ష జరపనున్నారు.దుమ్మెత్తి పోసిన విపక్షాలునిర్వహణ లోపాలు, వీఐపీల స్నానాల మీదే అధికారుల ధ్యాస, ఘనంగా నిర్వహిస్తున్నామని అతి ప్రచార ఆర్భాటాలతో తొక్కిసలాట జరిగిందని విపక్షాలు యోగి, మోదీ ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశాయి. ‘‘ వీఐపీ సంస్కృతి వదిలేయండి. సాధారణ భక్తులను పట్టించుకోండి. ప్రచారంపై దృష్టిపెట్టి పటిష్ట భద్రతను గాలికొదిలేయడం వల్లే తొక్కిసలాట జరిగింది’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ, టీఎంసీ, శివసేన(యూబీటీ), బీఎస్పీ పార్టీలు యోగి, మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి. -
MahaKumbh 2025: 10 రోజులు..10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ/మహాకుంభ్ నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 10 రోజుల్లోనే ఏకంగా 10 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమ స్థలికి భక్తులు బారులు తీరుతున్నారు. కుంభమేళాకు చేరుకోవడానికి రైళ్లు, విమానాలపై ఆధారపడుతున్నారు. వెయ్యికి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతి రైల్లోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉంటున్నాయి. జనరల్ బోగీల పరిస్థితైతే వర్ణనాతీతం! ఒక్కో రైలుకు నాలుగైదు చొప్పున జనరల్ బోగీలున్నా అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి! ఢిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. పైగా అప్పటికప్పుడు ప్రయాణ వేళలు మార్చడం, టికెట్ ధరలను విపరీతంగా పెంచడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇవి పాటించాలి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించే విషయంలో పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. కుంభమేళాలో స్నానం మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవడానికని గుర్తుంచుకోవాలి. స్నానం ఆచరించే ముందు సంగమ జలాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మేళాలో తొలి స్నానం క్షేమం కోసం, రెండోది తల్లిదండ్రుల పేరుతో, మూడోది గురువు పేరుతో ఆచరించాలి. త్రివేణి సంగమ పవిత్ర జలాన్ని ఇంటికి తెచ్చుకోవాలి.యోగి పుణ్యస్నానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గ సహచరులతో కలిసి మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లోనే కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ప్రయాగ్‌రాజ్‌లో రెండు నూతన వారధుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్శించబోతున్నట్లు తెలిపారు. యూపీ యువతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా త్రివేణి సంగమంలో యోగి పుణ్యస్నానం ఆచరించారు.అంతరిక్షం నుంచి కనువిందు కోట్లాది భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా కనిపిస్తున్న మహా కుంభమేళా దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం విడుదల చేసింది. వీటిని అంతరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా చిత్రీకరించా రు. టెంట్ సిటీ ఏర్పాటవక ముందు, ఏర్పాటైన తర్వాతి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మేళా పరిసర ప్రాంతాలు సైతం ఆకర్షిస్తున్నాయి. 2023 సెపె్టంబర్లో, 2024 డిసెంబర్ 29న చిత్రీకరించిన ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు దర్శనమిస్తున్నాయి. -
Maha Kumbh 2025: భక్తజన జాతర
సాక్షి, న్యూఢిల్లీ: మహా కుంభమేళాకు భక్తుల వరద అంచనాలకు మించుతోంది. మేళాలో పాల్గొని పవి త్ర స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 3.5 కోట్ల మందికి పైగా వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి సందర్భంగా మంగళవారం అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నానాయుధ ధారులైన నాగా సాధువులు, సంతులు తొలి ‘షాహీ స్నాన్ (రాజస్నానం)లో పాల్గొన్నారు. తెల్లవారుజాము 3 గంటల వేళ శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచయతీ అటల్ అఖాడా సాధువులు త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిపై హెలికాప్టర్ నుంచి పుష్పవర్షం కురిపించింది. ఈ సందర్భంగా డమరుక, శంఖనాదాలతో సంగమ స్థలమంతా ప్రతిధ్వనించింది. ఇక బుధవారం కూడా దాదాపు కోటి మంది దాకా భక్తులు వచ్చినట్టు చెబుతున్నారు. తొలి రోజు సోమవారం 1.65 కోట్లకు పైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించినట్టు వెల్లడించడం తెలిసిందే. తొలి మూడు రోజుల్లో భక్తుల సంఖ్య 6 కోట్లు దాటినట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య జనవరి 29న రానుంది. ఆ రోజు భక్తుల సంఖ్య ఏకంగా 10 కోట్లు దాటుతుందని అంచనా! అందుకు ఏర్పాట్లూ చేయాల్సిందిగా సీఎం యోగి ఆదేశించారు. ఆరోగ్యానికి పెద్దపీట భక్తులు అసంఖ్యాకంగా వస్తున్నందున వ్యాధులు ప్రబలకుండా యూపీ సర్కార్ అన్ని చర్యలూ తీసుకుంది. 100 పడకలతో ‘సెంట్రల్’ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఓపీతో పాటు ఇందులో ఆపరేషన్లు కూడా చేసే వీలుంది. ఇక్కడి మెడికల్ స్టోర్‌లో 276 రకాలకు చెందిన ఏకంగా 107 కోట్ల ట్యాబ్లెట్లున్నాయి! 380 పడకలతో 43 తాత్కాలిక ఆసుపత్రులు, అసంఖ్యాకంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 14 ఎయిర్ అంబులెన్సులూ అందుబాటులో ఉన్నాయి. 400 మంది వైద్యులు, వెయ్యికి పైగా సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు.లారెన్ పావెల్ కాళీ బీజదీక్ష యాపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ బుధవారం త్రివేణి సంగమ ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. ‘‘అనంతరం శ్రీ నిరంజనీ పంచాయ్ అఖాడా అధిపతి స్వామీ కైలాసానందగిరి నుంచి ఆమె కాళీ బీజదీక్ష స్వీకరించారు. గురుదక్షిణ కూడా సమర్పించారు’’ అని అఖాడా ప్రతినిధి వెల్లడించారు. ఆమె సోమ, మంగళవారాల్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పవిత్ర స్నానం అనంతరం కోలుకున్నట్టు ప్రతినిధి తెలిపారు.నాగసాధువులతో ‘వాక్ బయటి ప్రపంచానికి ఎప్పుడూ మిస్టరీగానే ఉండే నాగ సాధువుల జీవితాలను గురించి తెలుసుకునేందుకు కుంభ మేళా సందర్భంగా యూపీ సర్కారు వీలు కల్పించింది. వారితో ‘వాక్ టూర్’ను అందుబాటులోకి తెచ్చింది. ప్యాకేజీని బట్టి రూ.2వేల నుంచి రూ.3,500 దాకా చెల్లిస్తే చాలు, నాగ సాధువులతో వాక్ టూర్ చేయవచ్చు. అఘోరీలు, కల్పవాసీల గురించి కూడా టూర్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం 900 మందికి పైగా సుశిక్షిత టూర్ గైడ్లు అందుబాటులో ఉన్నారు. -
అది ప్రపంచంలోని ఏకైక 5 నదుల సంగమ ప్రాంతం.. మన దేశంలో ఎక్కడున్నదంటే..
నదులు.. ఏ దేశానికైనా జీవనాధారంగా భాసిల్లుతుంటాయి. నదులు మనిషి సమస్త అవసరాలను తీరుస్తుంటాయి. మానవ నాగరికత నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందింది. నదులు తమ దారిన తాము వెళ్లిపోతూ, తమకు అడ్డుపడే వాటిని కూడా తమతోపాటు తీసువెళ్లిపోతాయని చెబుతుంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు,లేదా మూడు నదులు కలవడాన్ని మనం చూసుంటాం. ఉదాహరణకు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదులు కలవడంతో అక్కడి త్రివేణీ సంగమం ఏర్పడింది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఐదు నదులు కలిసే ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఆ ప్రాంతం మన దేశంలోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడా కనిపించని కొన్ని అద్భుతాలు భారత్‌లో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని పచ్నద్కు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారత కాలంలో పాండవులు తమ ప్రయాణంలో ఈ ప్రాంతంలో బస చేశారని చెబుతారు. పాండవులలో ఒకడైన భీముడు ఈ ప్రాంతంలోనే బకాసురుడిని వధించాడని చెబుతారు. శ్రీరాముని భక్తుడైన తులసీదాసు ఈ ప్రాంతంలోనే పర్యటించాడని చెబుతారు. బుందేల్‌ఖండ్ పరిధిలోని జాలౌన్‌లో ఐదు నదులు సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్నే పచ్నద్ అంటారు. ప్రకృతి సౌందర్యానికి, హిందూ ఆధ్యాత్మిక నమ్మకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఏడాదిలో ఒకసారి ఇక్కడ మేళా జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడికి లెక్కకుమించిన సంఖ్యలో భక్తులు వస్తారు. పచ్నద్ను మహాతీర్థరాజం అని కూడా అంటారు. ప్రపంచంలో ఐదు నదులు సంగమించే ప్రాంతం ఇదొక్కటే కావడం విశేషం. ఇక్కడ యమున, చంబల్, సింధు, పహుజ, కన్వరి నదులు సంగమిస్తాయి. పచ్నద్ సంగమతీరంలో బాబా సాహెబ్ మందిరం ఉంది. ఈయన గోస్వామి తులసీదాసు సమకాలికుడని చెబుతారు. ఈయన ఇక్కడే తపమాచరించి, ఒక గుహలో విలీనమైపోయారని స్థానికులు చెబుతుంటారు. ఈ పంచనదుల సంగమప్రాంతంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే కాన్ఫూర్, దేహాత్, జాలౌన్, ఔరయ్యా ప్రాంతాల రైతులకు మేలు జరగనుంది. ఇది కూడా చదవండి: అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు? -
4న కుంభమేళాలో పుణ్యస్నానం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4వ తేదీన రాహుల్, ప్రియాంక కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే రోజు ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం సోదరుడు రాహుల్‌తో కలిసి లక్నోలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఒకవేళ ఫిబ్రవరి 4వ తేదీన వీలుకాకుంటే 10వ తేదీన వసంత పంచమి రోజు కుంభమేళాకు వెళతారని సమాచారం. తోబుట్టువులిద్దరూ గంగ, యమున, అంతర్వాహిని సరస్వతీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయనుండటం ఇదే ప్రథమం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కీలకంగా వ్యవహరించేందుకు ఇటీవల సోదరి ప్రియాంకకు రాహుల్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హిందుత్వ భావనపై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ఆవలంబిస్తోందనే అపవాదును తొలగించుకునేందుకే రాహుల్, ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2001లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ కుంభమేళాలో పాల్గొన్నారు. గోవాలో రాహుల్, సోనియా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం శనివారం గోవాకు చేరుకున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. రాబోయే మూడు రోజులు వీరు గోవాలోనే ఉంటారన్నారు. వీరు దక్షిణగోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బసచేస్తున్నారన్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమనీ, రాహుల్, సోనియా పార్టీ నేతలను కలుసుకోబోరని స్పష్టం చేశారు. -
లక్షల జనం
పలు పుష్కర ఘాట్లలో సినీనటుల సందడి సోమశిలలో బాలకష్ణ పుణ్యస్నానం.. పిండప్రదానం రంగాపూర్‌లో ఉపాసన, బీచుపల్లిలో అశోక్‌కుమార్ పుణ్యస్నానాలు ఘాట్ల వద్ద వెల్లివిరిసిన రక్షాబందన్ పుష్కరస్నానం ఆచరించి సోదరులకు రాఖీలు కట్టిన సోదరిమణులు డీఐజీ అకున్ సబర్వాల్‌కు రాఖీ కట్టిన ఎస్పీ, విద్యార్థులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కష్ణ పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏడో రోజూ భక్తులు పోటెత్తారు. రక్షా బంధన్ సెలవు దినం కావడం.. పుష్కరాల ముగింపు 5 రోజులే మిగిలి ఉండడంతో కొంత రద్దీ పెరిగింది. ఘాట్లలో జనం కిటకిటలాడారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 12.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించినట్లు అధికారులు తెలిపారు. గొందిమళ్ల, సోమశిల, బీచుపల్లి, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు వరుసగా భక్తులతో పోటెత్తాయి. జూరాల ఘాట్‌లో నీళ్లు లేకపోవడంతో వరుసగా మూడోరోజు మూసివేశారు. జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు తగ్గడంతో ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేయడాన్ని అధికారులు నియంత్రించారు. దీంతో పలు పుష్కరఘాట్లలో నీరు కొంత మేర తగ్గింది. అయితే పుష్కరాలు పూర్తయ్యేంత వరకు భక్తుల పుణ్యస్నానాలకు నీటి ఇబ్బంది ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ఘాట్లలో రక్షాబంధన్ గురువారం రక్షా బంధన్ కావడంతో పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం చేసిన భక్తులు తమ సోదరిమణులతో రక్షా బంధనం కట్టించుకున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌కు ఎస్పీ రెమా రాజేశ్వరి రంగాపూర్ ఘాట్‌లో రాఖీకట్టారు. పలువురు విద్యార్థులు డీఐజీకి రక్షా బంధనం కట్టారు. దీనికి డీఐజీ స్పందిస్తూ తనకు ఈ రక్షా బంధనం ఎస్పీతో సహా ఆరుగురు సోదరిమణులను ఇచ్చిందని అన్నారు. తనకు రక్షాబంధనం కట్టిన విద్యార్థులకు తన ఫోన్‌నంబర్ ఇవ్వడమే కాకుండా వారి నుంచి ఫోన్‌నంబర్లు తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తనను కలవొచ్చని ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని రాఖీ కట్టిన విద్యార్థినులకు చెప్పారు. పలువురు పోలీసులకు మహిళా పోలీసులు రాఖీలు కట్టారు. వివిధ శాఖల సిబ్బందికి కూడా రక్షాబంధన్ కట్టారు. పుష్కరస్నానం ఆచరించి పిండప్రదానం చేసిన హీరో బాలకష్ణ మరోవైపు వివిధ పుష్కర ఘాట్లలో ప్రముఖ సినీ నటులు పుణ్యస్నానాలు ఆచరించారు. నందమూరి బాలకష్ణ సోమశిల పుష్కరఘాట్‌లో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తండ్రి ఎన్టీ రామారావు, తల్లి బసవతారకమ్మలకు పిండ ప్రదానం చేశారు. బాలకష్ణతో పాటు ఆయన సోదరిమణులు, కుటుంబీకులు, బంధువులు పాల్గొన్నారు. తొలుత కొల్లాపూర్ చేరుకున్న బాలకష్ణను రాష్ట్ర మంత్రి జూపల్లి కష్ణారావు కలిశారు. కేఎల్ఐ అతిథి భవనంలో జూపల్లి కష్ణారావు అల్పాహార విందులో బాలకష్ణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బాలకష్ణ కొల్లాపూర్ వస్తున్న విషయంపై సమాచారం లేకపోవడంతో పలువురు నేతలు విషయాన్ని బాలకష్ణ దష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన బాల కష్ణ అల్పాహారం కాగానే పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమం పెట్టుకోమని సూచించడంతో కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసేందుకు పార్టీ నేతలు ఆహ్వానించారు. దీంతో బాలకష్ణ ఎన్‌టి రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలు బాలకష్ణకు రాఖీ కట్టారు. అనంతరం అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని బాలకష్ణ కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రముఖుల సందడి.. రంగాపూర్ పుష్కరఘాట్‌లో ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పుణ్యస్నానమాచరించారు. బీచుపల్లి పుష్కరఘాట్‌లో సినీ నిర్మాత అశోక్‌కుమార్ పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు విచ్చేసే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని పుష్కర ఏర్పాట్లు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయని ఇందు వల్ల భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు కలుగుతున్నాయని అన్నారు. -
రెండో రోజు పుష్కరా పుణ్యస్నానాలు
-
పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తజనం
తెల్లవారుజాము 3 గంటల నుంచే స్నానాలు కృష్ణానదిలో నీరు లేక జల్లు స్నానాలతో సరి విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మహా శివరాత్రి పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానది తీరంలోని పద్మావతి, సీతమ్మ వారి పాదాలు, దుర్గ, భవానీపురం, పున్నమి ఘాట్లకు భారీగా తరలివచ్చారు. నదిలో నీటి మట్టం పడిపోవడంతో భక్తులందరూ జల్లు స్నానాలతో సరిపెట్టారు. పుణ్యస్నానాల కోసం దుర్గాఘాట్‌కు చేరుకున్న భక్తులు గంటల తరబడి క్యూలైన్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దుర్గాఘాట్ నీరు పూర్తిగా మురికిగా మారింది. మోటారుతో నీరు తోడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు సమీపంలోని పాత శివాలయం, అశోక స్థూపం సమీపంలోని విజయేశ్వరాలయం, ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని పూజించారు. విశేష అలంకరణ మహా శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయాలను విశేషంగా అలంకరించారు. పెళ్లి కుమార్తె దుర్గమ్మను, అంతరాలయ ప్రాంగణాన్ని సప్తవర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మరో వైపున మల్లేశ్వరాలయాన్ని బంతి, జిల్లేడు పూలతో అలంకరించారు. ఆది దంపతుల కల్యాణోత్సవానికి ముస్తాబైన ఇంద్రకీలాద్రిపై ఎక్కడ చూసినా పచ్చటి మామిడి తోరణాలు, అరటిచెట్లు స్వాగతం పలికాయి. భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి మహా శివరాత్రి మహోత్సవాలను పురష్కరించుకుని ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా పెళ్లి కుమార్తెగా ముస్తాబైన దుర్గమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం శివ నామస్మరణతో వచ్చారు. భక్తుల క్యూలైన్ పాత అన్నదాన భవనం వరకు చేరింది. దుర్గగుడి ఈవో అప్రమత్తం కృష్ణలంక సీతమ్మవారి పాదాల ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసేందుకు దేవస్థానం షవర్లు ఏర్పాటు చేసింది. అయితే కొంత మంది భక్తులు ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఐరన్ మెస్ తొలగించి నదిలో స్నానాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఊబి, ప్రమాదకరమైన గుంతలు ఉంటాయని తెలుసుకున్న దుర్గగుడి ఈవో నర్సింగరావు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఐరన్ మెస్ తిరిగి ఏర్పాటుచేయించారు. అనంతరం జిల్లా అధికారులు, పోలీసు శాఖకు సమాచారం ఇచ్చారు. సుమారు రెండు గంటలపాటు ఈవో నర్సింగరావు, ఏఈవో వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ ఎన్.రమేష్ నదివద్దే ఉండి భక్తులు నీటిలోకి దిగకుండా చర్యలు తీసుకున్నారు. -
మృత్యువులోనూ చేయికలిపి..
శివరాత్రి స్నానాలకెళ్లి మృత్యువాత ఇద్దరు మృతితో దివిసీమలో విషాదఛాయలు శివరాత్రి పర్వదినం..నదిలో స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఆ ముగ్గురూ నదిలో పుణ్య స్నానాలకు దిగారు.. నీళ్లు అల్లరి పెడుతుంటే ఆనందంతో మరింత లోతుకు వెళ్లారు.. సరదా గడిపిన యువకులను మృత్యువు వెంబడించింది.. ముగ్గురూ చెల్లాచెదురయ్యూరు.. వీరిని గమనించిన స్థానికులు ఒకరి ప్రాణాలను నిలబెట్టగలిగారు.. ఆ ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నదీ గర్భంలో కలిసి శివైక్యమయ్యూరు. పాత ఎడ్లంక (అవనిగడ్డ) పుణ్యస్నానాలకు వెళ్లి.. కృష్ణానదిలో స్నానం చేసేందుకు స్నేహితులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్‌కుమార్, సింహాద్రి సాయినవీన్ దిగారు. సరదాగా ఈత వేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. సాయినవీన్‌ను అంబేడ్కర్ కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఇద్దరి కోసం వెతుకులాడే ప్రయత్నంలో అంబేడ్కర్ కూడా ఆపాయంలో చిక్కుకుని కేకలు వేయడంతో గజ ఈతగాళ్లు రక్షించారు. మునిగిన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలించారు. ఆచూకీ దొరకలేదు. దీంతో వలతో సుమారు 500 మీటర్లు గాలించడంతో రమణ, మనోజ్‌కుమార్ కుమార్ మృతదేహాలు దొరికాయి. స్నానాలకు వెళ్లొదని చెప్పినా.. శివరాత్రి స్నానాలకు వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్లి విగత జీవిగా వచ్చావా నాయనా అంటూ మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులు విలపించారు. కుమార్ అవనిగడ్డ జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నువ్వు లేకుండా నేను ఎలా బతకను తమ్ముడూ అంటూ సోదరుడు పవన్‌కుమార్ విలపించారు. మనోజ్‌కుమార్ తండ్రి బసవపున్నారావు స్థానిక వెల్డింగ్ షాపులో పనిచేస్తుండగా సోదరుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, ఎస్సీసెల్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు నలుకుర్తి రమేష్, డీఎస్పీ ఖాదర్‌బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మత్యుంజయుడు సాయినవీన్ సింహాద్రి సాయినవీన్ మృత్యుంజయుడిగా బ యట పడ్డాడు. మిత్రులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్‌కుమార్‌తో కలిసి కృష్ణానదిలోకి స్నా నాలకు వెళ్లిన ఈ ముగ్గురూ మునిగిపోయారు. అం బేడ్కర్ మునిగిపోయిన సాయినవీన్ని కాపాడాడు. ప్రమాదాన్ని గుర్తించి ఉంటే.. ముగ్గురు యువకులు మునిగిపోయినప్పుడే చూసిన వారు చెప్పి ఉంటే గజ ఈతగాళ్లు కాపాడేవారే. అంబేడ్కర్‌ని కాపాడిన తరువాత మరొకరు ఉన్నారని చెప్పారు. అప్పటికే 15 నిముషాలు గడచిపోయింది. గజ ఈతగాళ్ళకు అంబేడ్కర్ చేయి కనబడటంతో వెంటనే రక్షించ గలిగారు. ఆ సమయంలో గల్లంతైన ఇద్దరి గురించి చెప్పి ఉంటే వారిని రక్షించే వారమని గజ ఈతగాళ్లు చెప్పారు. రమణ కుటుంబంపై పగబట్టిన విధి.. రమణ తండ్రి కోటేశ్వరరావు పదేళ్ల క్రితం చనిపోగా, తల్లి నాగరత్నం నాలుగేళ్ల క్రితం మరణించింది. నలుగురు వివాహిత కూతుళ్లుండగా రమణ ఒక్కడే మగపిల్లవాడు. తల్లిదండ్రులు చనిపోయినా అక్క వద్ద ఉంటూ నాగాయలంకలో మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. రమణ శివరాత్రి స్నానాలకు వచ్చి మృత్యువు పాలవ్వడంతో సోదరి కొల్లూరి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. రక్షించబోయి.. ప్రమాదం నుంచి బయటికి.. పాత ఎడ్లంక(అవనిగడ్డ) : ప్రమాదంలో యువకులను కాపాడే ప్రయత్నంలో అంబేడ్కర్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించడంలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈత వేస్తు ముగ్గురు యువకులు మునిగిపోతుండగా గుర్తించిన అంబేడ్కర్ అందులో సింహాద్రి సాయినవీన్‌ను కాపాడాడు. మిగిలిన ఇద్దరిని రక్షించేందుకు నదిలో దిగాడు. కాని లోతు అందకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించారు. ఎస్ఐ వెంకటకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు కలిసి మచిలీపట్నం తరలించారు. -
హిమగిరి ఎత్తు గురితో..
వరద నీరు బిరబిరా ప్రవహించిపోరుునట్టు.. చూస్తుండగానే.. ‘చూసువారలకు మాటలకందని ముచ్చట’గా, ‘స్నానం చేసువారలకు ఏ కాటా చాలని పున్నెపుమూట’గా సాగుతున్న గోదారమ్మ పుష్కరపర్వంలో పదిరోజులు గడిచిపోయూరుు. ‘తనపై గురి హిమగిరి ఎత్తున ఉందా? తన ఒడిలో ఓలలాడాలనే బిడ్డలు ఇన్నికోట్లున్నారా?’ అని ఆ నదీమతల్లే విస్తుబోరుు, కెరటాల కనురెప్పలు విప్పార్చి చూసేస్థారుులో.. తెలుగు రాష్ట్రాల్లోని నలుచెరగుల నుంచీ; దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచీ; విదేశాల నుంచీ భక్తులు పోటెత్తారు. వరదవేళ బ్యారేజి లాకులెత్తితే కడలి దిక్కుకు దుమికే జలరాశిలా జనరాశి తీరాలకు పరవళ్లు తొక్కారు. పదోరోజైన గురువారం ప్రతి రేవూ భక్తజన సింధువే అరుుంది. - గోదారమ్మను చేరుతున్న భక్తజనఝరి - పదోరోజూ ఉరవడి తగ్గని పుష్కర సంరంభం - గురువారం 33 లక్షల మంది పుణ్యస్నానాలు - సెలవు రోజులను తలపించిన వైనం - మరో రెండు రోజూలూ ఇంతే ! - బ్యారేజి గేట్లు ఎత్తడంతో తేటపడనున్న ఘాట్ల నీరు రాజమండ్రి : పన్నెండేళ్లకోసారి పన్నెండురోజులు జరిగే గోదావరి పుష్కరాల్లో పదిరోజులు గడిచిపోయూయి. గురువారం కూడా రాజమండ్రి సహా జిల్లాలోని ఘాట్లు భక్తులతో కిక్కిరిశారు. సెలవు రోజుల్లో మాదిరిగా యాత్రికులు పోటెత్తారు. ఈ నదీపర్వంలో చివరి రెండురోజులైన శుక్ర, శనివారాలు ఈ సంఖ్య మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. గురువారం రాజమండ్రి నగరంలో పలుమార్లు, పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించి భక్తులు అష్టకష్టాలు పడ్డారు. పుష్కరాలు ఆరంభమైన తరువాత గత శని, ఆదివారం సెలవు రోజుల్లో యాత్రికులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గురువారం మరోసారి అదే తాకిడి కనిపించింది. రాత్రి ఎనిమిది గంటల సమయానికి జిల్లాలో పుష్కరస్నానాలు చేసినవారి సంఖ్య 33 లక్షల మందికి చేరింది. పుష్కరాలు ఆరంభమయ్యూక ఒకేరోజు 30 లక్షల మంది దాటి భక్తులు రావడం ఇది నాల్గవసారి. రాజమండ్రిలో కోటిలింగాలు, పుష్కరఘాట్లు జనసంద్రంగా మారాయి. కోటిలింగాల ఘాట్‌కు తాకిడి మరీ ఎక్కువగా ఉంది. కోటిపల్లి ఘాట్‌లో 2.30 లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. అంతర్వేదిలో 50 వేల మంది, కుండలేశ్వరంలో 40 వేలు, అప్పనపల్లిలో 55 వేలు, సోంపల్లిలో 75 వేల మంది పుష్కర స్నానాలు చేశారు. మిగిలిన గ్రామీణ ఘాట్లలో సైతం స్నానాలు చేసిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది. పదే పదే అవే ఇక్కట్లు.. యాత్రికుల రద్దీతోపాటు వారి ఇక్కట్లు కూడా భారీగా పెరిగాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో నిలబడేందుకు సైతం జాగాలేక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ వద్ద పరిస్థితి మరీదారుణంగా ఉంది. బస్సులు బయటకు వచ్చేందుకు, లోనికి వెళ్లేందుకు సైతం స్థలం లేక పోవడం, బస్టాండ్ బయటే బస్సులు నిలిచిపోవడంతో తాడితోట- మోరంపూడి రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించింది. హైవేలో కూడా స్వల్పంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మూడు కోట్లకు చేరువలో.. జిల్లాలో పుష్కరస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం మూడు కోట్లకు చేరుకునే అవకాశముంది. పుష్కరాలు ఆరంభమైన ఈ పది రోజుల్లో సుమారు 2.72 కోట్ల మంది స్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో పుష్కరాలు ముగుస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. శుక్రవారం కూడా ఇదే స్థాయిలో భక్తుల తాకిడి ఉంటే స్నానాలు చేసిన వారి సంఖ్య మూడు కోట్లుదాట నుంది. పుష్కరస్నానం చేసిన ప్రముఖులు ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి సరస్వతిఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. ఆయనతోపాటు సినీరంగానికి చెందిన ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయచందర్, అడిషనల్ డీజీపీ ఆర్.పి.ఠాకూర్, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.సి.శర్మ, డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కన్నబాబు పుణ్యస్నానాలు చేశారు. గోదావరికి పెరిగిన ఇన్‌ఫ్లో గోదావరి పరీవాహక ప్రాంతంలో బుధవారం కురిసిన వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో పెరిగింది. సీలేరు నుంచి రోజూ విడుదలవుతున్న పది వేల క్యూసెక్కుల నీటికి తోడు ఇన్‌ఫ్లో పెరగడంతో బ్యారేజ్ నుంచి గురువారం 56,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇదే సమయంలో డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి నీరు సముద్రంలోకి విడుదల చేయడంతో.. ఇప్పటి వరకూ ఘాట్లలో కలుషితమైన నీరు పోయి.. కొత్తనీరు రానుంది. ఈ రెండు రోజులూ భక్తులు కొంచెం స్వచ్ఛమైన నీటిలో స్నానం చేసే అవకాశం లభించింది. -
జయ జయ గోదావరి
* తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ * తెలంగాణలో ఉదయం 6.21, ఏపీలో 6.26 గంటల నుంచి పుష్కర సంరంభం * 12 రోజులపాటు జనసంద్రం కానున్న గోదావరి తీరం * పుణ్యస్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా తరలివెళ్తున్న భక్తులు * కుటుంబ సమేతంగా ధర్మపురికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ * భద్రాచలంలో పుష్కరాలు ప్రారంభించనున్న చినజీయర్ * రాజమండ్రిలో పుణ్యస్నానం చేసి ప్రారంభించనున్న జయేంద్ర సరస్వతి * అనంతరం అక్కడే స్నానమాచరించనున్న ఏపీ సీఎం చంద్రబాబు (రాజమండ్రిలో సోమవారం రాత్రి గోదావరికి హారతి ఇస్తున్న దృశ్యం) అమృత ఘడియలు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాలకు పుష్కర శోభను తెచ్చాయి. పవిత్ర గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం వరకు, ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ నుంచి అంతర్వేది వరకు తీరం యావత్తూ జయజయ ధ్వానాలతో మార్మోగుతోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తొలి పుష్కరాలు కావడం, అందునా 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా పుష్కరాలు కావడంతో జనం పెద్దఎత్తున పవిత్ర స్నానాలకు తరలి వెళ్తున్నారు. తెలంగాణలో మంగళవారం ఉదయం 6.21 గంటలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6.26 గంటలకు దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయాన గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభం కానున్నాయి. ధర్మపురిలో పుష్కర స్నానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రమే కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజమండ్రి పుష్కరఘాట్‌లో సకుటుంబంగా పుష్కర స్నానం ఆచరిస్తారు. తెలంగాణలో.. తెలంగాణలో ప్రముఖ క్షేత్రాలకు సోమవారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. తొలిరోజు పది లక్షల మంది నదీ స్నానం ఆచరిస్తారని అంచనా. తెలంగాణ తొలి పుష్కరాలు కావటంతో వీటిని కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం భావించి విస్తృత ప్రచారం నిర్వహించింది. కానీ గోదావరిలో నీటి ప్రవాహం లేకపోవటంతో భక్తుల్లో నిరాశ నెలకొంది. వరుణుడు కరుణించకపోవటంతో జలకళ లేక చాలాచోట్ల ఘాట్లు వెలవెలబోతున్నాయి. మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పెట్టుకున్న ఆశలూ ఆవిరయ్యాయి. దీంతో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోని నీటి విడుదలతోనే సరిపుచ్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. అవి కూడా అంతంత మాత్రమే కావటంతో పుష్కర ఘాట్ల వరకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బాసర నుంచి భద్రాచలం వరకు ఒక్క కాళేశ్వరం వద్ద మాత్రమే ఘాట్ల వరకు నీళ్లున్నాయి. సీఎం స్నానం ఆచరించనున్న ధర్మపురిలో ఘాట్ల నుంచి 10 మీటర్లు వెళ్లిన తర్వాతే నీళ్లున్నాయి. కాళేశ్వరంలో వసతులేవీ?: పుష్కలంగా నీళ్లున్న త్రివేణి సంగమ ప్రాంతమైన కాళేశ్వరంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. సోమవారం రాత్రి వరకు ఇక్కడికి దాదాపు 3 వేల మంది భక్తులు చేరుకున్నారు. వారికి సరైన వసతి లేదు. దేవాలయ నిర్వాహకులు సాధారణ టెంట్లు వేయటంతో వాటి కిందే సేద తీరారు. భద్రాచలం కళకళ: మిగతా క్షేత్రాలతో పోలిస్తే భద్రాచలం భక్తులతో కళకళలాడుతోంది. సోమవారం రాత్రి వరకు ఇక్కడికి పది వేల మంది వరకు భక్తులు చేరుకున్నారు. ఉదయం 6.21 సమయంలో త్రిదండి చినజీయర్ స్వామి ఇక్కడ స్నానమాచరించి మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావుతో కలసి పుష్కరాలను ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ కూడా ఘాట్ల వద్ద నీళ్లు లేవు. 10 మీటర్ల మేర బురదలో నడిచి నీటి వద్దకు చేరుకోవాల్సిన పరిస్థితి. భద్రాచలానికి సమీపంలోని తారపాక వద్ద నాగ సాధువుల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లు గాలివానతో కూలిపోయాయి. బాసర వెలవెల: దాదాపు లక్ష మంది వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్న బాసర వెలవెలబోతోంది. నదిలో ప్రవాహం తక్కువగా ఉండటంతో భక్తులు ఇక్కడికి రావటానికి ఉత్సాహం చూపటం లేదు. రోజువారీ భక్తులు తప్ప సోమవారం రాత్రి వరకు ఇక్కడికి అదనంగా ఎవరూ రాలేదు. వరంగల్‌లో రామన్నగూడెం, ముళ్లకట్ట, మంగపేట వద్ద ఘాట్లకు దూరంగా ప్రవాహం ఉంది. హైదరాబాద్ నుంచి అంతంతే: తొలి రోజు పుణ్యస్నానాల కోసం హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలుతారని ఆశించినప్పటికీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, వరంగల్ వైపు ఏమాత్రం డిమాండ్ లేకపోవటంతో ప్రత్యేక బస్సుల జోలికి వెళ్లలేదు. భద్రాచలం వైపు మాత్రం 30 ప్రత్యేక బస్సులు నడిపారు. మంగళవారం నుంచి రద్దీ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇబ్బంది లేకుండా చూడండి: సీఎం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం ధర్మపురికి వచ్చిన సీఎం పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. - సాక్షి, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీరం భక్తజనంతో పోటెత్తనుంది. పుష్కరాలు జరిగే 12 రోజులూ నదిలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారితో ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి సంకల్ప సహితంగా రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేసి పుష్కరాలు ప్రారంభమైనట్టు ప్రకటిస్తారు. సరిగ్గా ఇదే సమయానికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కంచిపీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం ఆచరించనున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం ఆచరిస్తారు. దేదీప్యమానంగా గోదావరి తీరం రాజమండ్రి వద్ద గోదావరి తీరాన్ని విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పచ్చదనం ఉట్టిపడేలా ప్రధాన పుష్కర ఘాట్లకు వెళ్లే రోడ్లతోపాటు, ప్రధాన కూడళ్లను మొక్కలతో తీర్చిదిద్దారు. ఘాట్లలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో సీలేరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. సీలేరు బేసిన్ నుంచి 10వేల క్యుసెక్కులు నీటిని సోమవారం విడుదల చేశారు. పీఠాధిపతుల రాక.. తొలి పుష్కర స్నానమాచరించేందుకు కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతి, మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి, త్రిదండి అహోబిల జీయర్‌స్వామి రాజమండ్రికి చేరుకోగా, మరికొంత మంది పీఠాధిపతులు, స్వామీజీలు మంగళవారం చేరుకోనున్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో స్నానమాచరించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు లాలాచెరువు వద్ద లక్ష మందితో ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ప్రసంగించనున్నారు. అట్టహాసంగా నిత్యహారతి అఖండ పుష్కరజ్యోతి యాత్ర రాజమండ్రి చేరుకున్న సందర్భంగా గోదావరి నదికి చంద్రబాబు సమక్షంలో సోమవారం రాత్రి ఇచ్చిన నిత్యహారతి అట్టహాసంగా జరిగింది. పుష్కర ఘాట్‌లో మెట్లపై హారతి ఇవ్వాల్సి ఉండగా.. గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటుపై నుంచి హారతి ఇచ్చారు. ఘాట్‌పై నుంచి కాకుండా సీఎం కోసం పంటుపై నుంచి హారతులు ఇవ్వడంతో ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరగలేదని భక్తులు ఆక్షేపిస్తున్నారు. అనంతరం గోదావరి ప్రాశస్త్యాన్ని లేజర్‌షో ద్వారా చూపించారు. - సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు, హైదరాబాద్ ఏపీలో అట్టహాసంగా పుష్కర శోభాయాత్ర ద్వారకాతిరుమల: గోదావరి పుష్కరాల శోభాయాత్ర అట్టహాసంగా మొదలైంది. శోభాయాత్రను ద్వారకాతిరుమలలోని చినవెంకన్న సన్నిధి వద్ద ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు మాణిక్యాలరావు, పీతల సుజాత సోమవారం ప్రారంభించారు. రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం సాక్షి, రాజమండ్రి: పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తిరుమల వేంకటేశ్వరస్వామి నమూనా ఆలయాన్ని సోమవారం ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం ఉదయం జరిగింది. ఉదయం ఆరు నుంచి రాత్రి 10.30 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. -
పుష్కర స్నానాలతో పునీతులుకండి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గోదావరి పుష్కర స్నానాలు చేసి పునీతులు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ గోదారమ్మ తల్లికి పూజలు చేసి.. వారి మనసులోని కోర్కెలు తెలిపి వాటిని నెరవేర్చుకోవాలని సూచించారు. సోమవారం ఆయన బంజారాహిల్స్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బుధవారం కుటుంబ సమేతంగా తాను భద్రాచలంలో పుష్కర స్నానం చేయనున్నట్లు చెప్పారు. గోదావరికి ఈ ఏడాది జరిగేవి మహా పుష్కరాలని, ఇవి 144 ఏళ్లకు ఒకసారి వస్తాయని చెప్పారు. పన్నెండేళ్లకు వచ్చే మామూలు పుష్కరాల కన్నా ఇప్పుడు జరుగుతున్న పుష్కరం ఎంతో ముఖ్యమైందని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండేలా చేయాలని ప్రజలందరూ గోదారమ్మ తల్లిని ప్రార్థించాలని పొంగులేటి చెప్పారు. నదీమ తల్లికి పుష్కరం వచ్చిందంటే ఆ 12 రోజులూ 12 పర్వదినాలతో సమానమన్నారు. పుష్కర కాలంలో నదీస్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని, నిజ ఆషాఢంలో పితరుల సంస్మరణార్థం శ్రార్ధకర్మలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే చాలా మంచిదని పొంగులేటి చెప్పారు. పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రతి తెలుగువారినీ కోరుకుంటున్నానని చెప్పారు.