మాట్లాడుతున్న ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్
భక్తుల సురక్షితమే లక్ష్యం
Published Fri, Aug 5 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
-కష్ణా పుష్కరాల కోసం
434ప్రత్యేక బస్సులు
- ప్రతి ఘాట్ వద్ద
‘మై హెల్ప్ యూ డెస్క్’ ఏర్పాటు
- ప్రతి రైల్వేస్టేçÙన్ నుంచి
ప్రత్యేక బస్సులు
- ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఈనెల 12నుంచి 23వ తేదీ వరకు జరిగే కష్ణ పుష్కరాలకు జిల్లా ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు సంబంధించిన బస్సుల వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో జరిగే కష్ణ పుష్కరాలకు దాదాపు 2కోట్ల మంది భక్తులు రావచ్చని అంచనా వేశామని, ఇందులో 60శాతం భక్తులు బస్సులను ఆశ్రయించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రతి 40నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పుష్కరస్నానం కోసం వివిధ ప్రాంతాల నుంచి రైలుమార్గంలో వచ్చేభక్తుల కోసం జిల్లాలో ఉన్న పలు రైల్వేస్టేçÙన్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని స్పష్టం చేశారు. దీంట్లో ప్రధానంగా మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్, శ్రీరాంనగర్, మదనాపురం తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు వెల్లడించారు.
పార్కింగ్ స్థలాల నుంచి బస్సులు
పుష్కరాల కోసం ప్రత్యేకంగా జిల్లా రీజియన్ నుంచి 294బస్సులు, ఇతర రీజియన్‌ల నుంచి 140బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకుని పుష్కరాల సమయంలో మరిన్ని అదనపు బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని చెప్పారు. రంగాపూ ర్, అచ్చంపేట, కష్ణఘాట్ల వద్ద ఆర్టీసీ బస్సుల పార్కింగ్ స్థలానికి, స్నానఘట్టాలకు మధ్య దూరం ఎక్కువ ఉన్న నేపథ్యంలో పార్కింగ్ స్థలం నుంచి ఘాట్ వరకు షెటిల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఘాట్‌లో ప్రత్యేక బస్సుల వివరాలతో పాటు ఆర్టీసీ నుంచి ‘మై హెల్ప్ యు డెస్క్’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తకోట, బీచుపల్లి, రంగాపూర్, ఆత్మకూర్‌లో రిలీఫ్ వ్యాన్స్ ఏర్పాటు చేశామని, అలాగే పెబ్బేర్‌లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధానంగా జడ్చర్ల, పెబ్బే రు జాతీయ రహదారిపై రెండు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా భక్తులకు బస్సుల సమాచారం ఎప్పటికప్పుడు చేరవేస్తామని చెప్పారు. పుష్కరాల కోసం ఆర్టీసీ నుంచి మంచి సర్వీస్ అందించడం కోసం ఇద్దరు ఆర్‌ఎంలు, ఆరుగురు డివిజన్‌స్థాయి అధికారులు, 12మంది డిపో మేనేజర్‌స్థాయి అధికారులతో పాటు 102మంది అదనపు సిబ్బందిని నియమించి నట్లు చెప్పారు. అలాగే ఆర్టీసీ హోంగార్డులు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి రంగాపూర్ ఘాట్‌కు 50ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీటీఎం రాజేంద్ర ప్రసాద్, సీఎంఈ మహేశ్‌కుమార్, డిపో మేనేజర్ భాస్కర్, సత్తయ్య, రామయ్య, రాజగోపాల్‌రావు, రాజీవ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement