గుంటూరు రూరల్: వేగంగా వెళ్తున్న టాటా ఏస్ ఆటో అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 8మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామం సమీపంలో జరిగింది. కాగా, గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వారిగా సమాచారం.
లారీని ఢీ కొన్న ఆటో: ముగ్గురు మృతి
Published Mon, Jul 20 2015 6:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement