నెల్లూరు: ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామం సమీపంలో జరిగింది.
వివరాలు.. జిల్లాలోని గూడూరు మండలం వెందోడు గ్రామస్తులు గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి బయలుదేరారు. కాగా, మార్గ మధ్యలో బస్సు ఆగి ఉన్న సమయంలో లారీ వచ్చిన ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.