రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్రగాయాలు
విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెలివిజన్ నటి రోహిణి రెడ్డికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పుష్కరాల్లో పాల్గొనడానికి వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న బెలీనో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోహిణిరెడ్డితో పాటు కారు డ్రైవర్ ఉషప్పగౌడ్, అసిస్టెంట్ చంటిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి.
విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తదితర సీరియల్స్లో రోహిణిరెడ్డి నటించారు.