భువనగిరి అర్బన్: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామం సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి డీసీఎం వ్యాన్‌తోపాటు ఓ మహిళను ఢీకొంది. మంగళవారం రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నందనం గ్రామానికి చెందిన భిక్షపతి, మణెమ్మ దంపతులు నడుచుకుంటూ వెళుతుండగా వలిగొండ వైపు వెళుతున్న బైక్ ఆమెను ఢీకొంది. అనంతరం అదే బైక్ ఎదురుగా వస్తున్న డీసీఎంను కూడా ఢీకొంది. దీంతో మణెమ్మతోపాటు బైక్‌పై వెళుతున్న నవీన్‌రెడ్డి, ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.