పుష్కరాలకు 12890 టోల్ ఫ్రీ నంబర్
ప్రత్యేక అధికారి ధనుంజయరెడ్డి
రాజమండ్రి సిటీ: పుష్కర ఏర్పాట్లపై ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 10 నుంచి టోల్ ఫ్రీ నంబర్ 12890 అందుబాటులోకి రానున్నదని పుష్కరాల ప్రత్యేక అధికారి కె.ధనుంజయరెడ్డి తెలిపారు. ఈ నంబరు 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. దీనికి వచ్చే ఫిర్యాదులను ఘాట్ ఇన్‌చార్జిలకు అందించి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. పుష్కర యాత్రికులకు చేపట్టిన ఏర్పాట్లు, సౌకర్యాలపై ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ తయారు చేయనున్నామన్నారు.
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే పుష్కరాల పార్కింగ్ స్థలాలు, బస్ స్టేషన్, బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్లు, పురోహితులు, పర్యాటక ప్రాంతాలు, ఆసుపత్రులు తదితర సమాచారం తెలుసుకోవచ్చన్నారు. నగరంలోని 20 ప్రాంతాల్లో స్మార్ట్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నిత్యావసర వస్తువుల రవాణాకు రాత్రి 9 నుంచి ఒంటిగంట వరకూ సడలింపు ఇస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు రప్పిస్తున్నామని తెలిపారు. నగరంలో 20 మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయనున్నట్లు ధనుంజయరెడ్డి తెలిపారు.