అప్పటి దాకా సంతోషం.. అంతలోనే విషాదం
♦ పుష్కరాలకు వెళ్లివస్తూ బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
♦ 42 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
♦ రక్తసిక్తమైన ప్రమాదస్థలి.. మిన్నంటిన క్షతగాత్రుల ఆర్తనాదాలు
రామాయంపేట : పుష్కర స్నానాన్ని పూర్తిచేసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరిన వారిని అంతలోనే ఆవిరైంది. పుష్కర అనుభూతులను తోటి ప్రయాణికులతో పంచుకుంటూ సాగుతున్న ప్రయాణం విషాదం మిగిల్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పుష్కరాల్లో పాల్గొనేం దుకు బాసర వెళ్లిన హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన భక్తులు శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ డిపోకు చెందిన పుష్కరాల ప్రత్యేక బస్సులో ఎక్కారు. బస్సు రామాయంపేట ఎల్లమ్మ గుడివద్దకు చేరుకోగా బస్సు వెనుక టైరు పగి లిపోవడంతో అదుపు తప్పి బోల్తాపడింది.
విషయం తెలుసుకున్న పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకి తీసి వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 48 మంది ఉండగా బస్ డ్రైవర్ కండక్టర్‌తో పాటు 42మంది గాయపడ్డారు. బ్రస్సులో నుంచి బయటపడిన వారు రక్తమోడుతున్న గాయాలతో తమవారి కోసం గాలిం చడం, చిన్నపిల్లలను హత్తుకోవ డం కంటతడి పెట్టించింది.
బాధితుల ఆర్తనాదాలు, విరిగిన కాళ్లు, చేతులు, రక్తసిక్తమైన పరిసరాలతో గం దరగోళంగా తయారైంది. కాగా 42 మందిలో త్రీవంగా గాయపడిన 16 మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వీరి లో భవాని, గణేశ్‌తో పాటు మనోహర్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో మెదక్ జిల్లా హ త్నూరకు చెందిన నరేందర్, నగేశ్, దేవయ్య, మనోహర్, సాగర్, రాజు, చేగుంట మండలం మక్కరాజ్‌పేటకు చెందిన కొండల్‌రెడ్డి, వర్గల్ మండలం అనంతసాగర్‌కు చెందిన సుధాకర్ తదితరులు ఉన్నారు.
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన డిప్యూటీ స్పీకర్..
ప్రమాద విషయం తెలియగానే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ ఆస్పత్రికి వెళ్లి రో గుల పరిస్థితిని సమీక్షించారు. వైద్య సేవలను పరిశీలించారు. అలాగే ఇదే సమయంలో హైదరాబాద్ వెళ్తున్న ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాధోడ్ బాబూరావు సంఘటనా స్థలంలో ఆగి వివరాలు తెలుసుకున్నారు.
పోలీసుల తీరు ప్రశంసనీయం
రామాయంపేటవద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడంతో పాటు వారికి సపర్యలు చేసే విషయమై పోలీసులు ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జునగౌడ్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు వాహనాలను సమకూర్చడంతో పాటు స్వయంగా స్ట్రెచర్‌పై తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు.