పుష్కరం.. పాపాహరణం
పుష్కరం.. పాపాహరణం
Published Tue, Aug 2 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
–పుష్కర స్నానంతో సకల పాపాలు మటుమాయం
–మహాపుణ్య ఫలం..
–ఇప్పటి వరకు మూడు పుష్కరాలు చూశా
–2004లో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు
–‘సాక్షి’తో శివాలయం ప్రధాన అర్చకుడు జూనోతుల సుధాకరశాస్త్రి
కోట్లాది ప్రజలు భక్తితో వేచి చూస్తున్న కృష్ణా పుష్కరాలకు సమయం ఆసన్నమైనది. మహిమాన్వితమైన కృష్ణా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే మహా పుణ్యఫలం దక్కుతుంది. దీర్ఘకాలిక రోగాలు మటుమాయమవుతాయి. కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. నదీతీరంలో తపుస్సు, కురుక్షేత్రంలో దానం, కాశి క్షేత్రంలో మరణం పొందినంత ఫలితం ఉంటుంది’ అంటున్నారు నాగార్జునసాగర్ కృష్ణా నదితీరంలోని శివాలయం ప్రధాన అర్చకుడు జూనొతుల సుధాకరశాస్త్రి. మరో పది రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పుష్కర అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..
–నాగార్జునసాగర్
పుష్కరమంత్రం :
‘పిప్పలాదా త్సముత్పనే– కృత్త్యేలోకే భయంకరే
మృత్తికాంతే మయాదత్త మహారార్ద ప్రకల్పయ
అస్యాం మహానద్యాం సమస్త పాపాక్షయార్దం కన్యాగతే
దేవగురౌ సార్ధ త్రికోటి తీర్థ సహిత,తీర్థ రాజ సమాగ మాఖ్య
మహాపర్వణి పుణ్యకాలే కృష్ణానదీ స్నానమహం కరిష్యే!
అని మూడుసార్లు తూర్పుగా తిరిగి మూడుమునకలు వేయాలి
(అంటే నదీ స్నానమును ఎల్లప్పుడూ గోచి పెట్టుకోని చేయాలి. మలమూత్ర విసర్జనములు నీటిలో చేయరాదు. ఉమ్మి వేయకూడదు)
1980లో వేళ్లమీద లెక్కపెట్టే భక్తులు
సాగర్‌లోని కృష్ణా నది తీరంలో శివాలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రధాన అర్చకులుగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు మూడు పుష్కరాలు చూశాను. 1980 పుష్కరాల సమయంలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలో భక్తులు వచ్చారు. 1992లో సౌకర్యాలు సరిగా లేకున్నా భక్తులు భారీగానే వచ్చారు. కృష్ణలో స్నానాలు చేసి స్వర్గస్తులైన వంశ కుటుంబ సభ్యులకు పిండప్రధానాలు చేసి ముక్తి పొందారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాగర్‌లో నాలుగు పుష్కరఘాట్లు నిర్మాణం చేయించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించారు. దీంతో పుష్కరస్నానంపై ప్రజలకు అవగాహన వచ్చింది. సాగర్‌కు లక్షల సంఖ్యలో భకుల్తు పోటెత్తారు. మెుదట ఘాట్లలో నీరు లేనప్పటికీ పుష్కరాలు పూర్తయ్యేలోపు నదిలోకి నీటి విడుదల జరిగింది.
దేవతలతో పాటు భక్తుల పుణ్యస్నానం
ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం మొదలుతో పుష్కరం ప్రారంభం అవుతుంది. అదే నెల 23న సూర్యాస్తమయం వరకు భక్తులు పుష్కర స్నానం ఆచరించవచ్చు. గురువు(బృహస్పతి) కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర సమయం ప్రారంభమవుతుంది. పుష్కర సమయం ప్రారంభంలో ముక్కోటి దేవతలు నదిలో స్నానాలు ఆచరిస్తారు. పుష్కరాలు జరిగే 12 రోజులు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజుల్లో ముక్కోటి దేవతామూర్తులు స్నానమాచరించే సమయంలో భక్తులు సైతం పుష్కర స్నానాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది.
చేయాల్సిన దానాలు
నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు పుష్కరాలు జరిగే 12రోజుల పాటు దానధర్మాలు చేస్తే పుణ్యఫలం దక్కుతుంది.
1వ రోజు : బంగారం, వెండి, ధాన్యం, భూమి అన్నదానం చేయాలి
2వ రోజు : ఆవు, రత్నాలు, ఉప్పు
3వరోజు : పండ్లు, కూరలు, బెల్లం, వెండితో చేసిన గుర్రం బొమ్మ
4వ రోజు : నెయ్యి, నూనె, తేనే, పాలు, చెక్కెర
5వ రోజు : ధాన్యం, పండ్లు, గేదెలు, నాగలి
6వ రోజు : మంచి గంధపు చెక్క, కర్పూరం, కస్తూరి, ఔషధాలు
7వ రోజు : ఇల్లు, వాహనం, కూర్చునే ఆసనం
8వ రోజు : పూలు, అల్లం, గంధపు చెక్క
9వ రోజు : కన్నాదానం, పిండప్రదానం
10వ రోజు : హరిహరపూజ, లక్ష్మీపూజ, గౌరిపూజ, నదిపూజ
11వ రోజు : వాహనం, పుస్తకాలు, తాంబూలం
12వ రోజు : నువ్వులు, మేకలను పేదవారికి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది.
Advertisement
Advertisement