పుష్కరాల్లో అపశ్రుతి
Published Sun, Aug 14 2016 1:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
–కరెంట్ షాక్‌తో తమిళనాడు వాసి మృతి
– నల్లగొండ జిల్లాలో ఘటన
–వివిధ శాఖల సమన్వయ లోపమే కారణం
–గుండెపోటని కప్పిపుచ్చుకునేందుకు అధికారుల యత్నాలు
నల్లగొండ టూటౌన్: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట వద్ద అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లాకు చెందిన చెవుగా పేరుమళ్లు (55) శనివారం విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఇటీవల కొంత కాలం నుంచి నల్లగొండ సమీపంలోని అద్దంకి బైపాస్ రోడ్డు వెంట ఉన్న లెప్రసీ కాలనీలో ఒక్కడే గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఛాయా సోమేశ్వరాలయం వద్దకు చేరుకొని పుష్కర స్నానం ఆచరించాడు. స్నానం చేసిన అతను దేవాలయం ప్రహరీపై పెట్టిన దుస్తులను తీసుకోవడానికి వెళ్లగా ఆలయం వద్ద డెకరేషన్ లైట్లకోసం పక్కనే భూమిలో ఎర్త్‌కునాటిన సీకు వైరు తగిలి అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అత్యవర వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మతి చెందినట్టు «ధ్రువీకరించారు. కరెంట్ షాక్‌తోనే మరణించినట్లు మొదట పేర్కొన్న అధికారులు ఆతరువాత మాటమార్చారు. గుండె పోటుతో చనిపోయాడనే ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం. మతుడినిS పోస్ట్ మార్టం చేయకముందే గుండె పోటు అని చెప్పడం గమనార్హం.
Advertisement