జోగుళాంబ ఘాట్ వద్ద నీటిని పరిశీలిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి
పోలీస్ నిఘాలో కృష్ణా పుష్కరాలు
Published Fri, Aug 5 2016 11:21 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
– 7సహాయక కేంద్రాలు
– ఎస్పీ రెమా రాజేశ్వరి
మహబూబ్‌నగర్ క్రైం : కృష్ణా పుష్కరాలు పోలీస్ నిఘాలో కొనసాగుతాయని, ప్రతి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ అధికారులు తీసుకుంటున్న భద్రత చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా పుష్కరాలకు వాహనాల్లో వచ్చే భక్తులకు షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్‌గేట్ దగ్గర ఉచిత పార్కింగ్‌కోసం గుర్తింపు పాస్‌లు అందజేస్తామన్నారు. ఈ పాస్ ఉన్న వాహనాలకు జిల్లాలోని వివిధ ఘాట్‌లలో ఉచిత పార్కింగ్‌తోపాటు పుష్కరాల సమాచారం లభిస్తుందన్నారు. అలాగే భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకుగాను తిమ్మాపూర్, రాయికల్, జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకుల, కడుకుంట్ల, పెబ్బేర్‌లో పోలీస్ శాఖ తరఫున సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కర ఘాట్‌లకు దారులు చూపే యాప్‌ను ఆవిష్కరించామన్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖ వినూత్నంగా చేపడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు.
జోగుళాంబ ఘాట్ సందర్శన
అలంపూర్: మండలంలోని గొందిమల్లలో నిర్మిస్తున్న జోగుళాంబ ఘాట్‌ను ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా పుష్కరాలకు రానుండటంతో భద్రత, పుష్కర ఘాట్‌లో నీటి స్థాయిని ఆమె పరిశీలించారు. సీఎం ఇక్కడే బస చేయనుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం అలంపూర్ పట్టణంలోని టూరిజం హోటల్, సమీపంలోని పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పర్వతాలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement