పుష్కరాలపై ఆబ్కారీశాఖ దృష్టి | special care on pushkaraalu | Sakshi
Sakshi News home page

పుష్కరాలపై ఆబ్కారీశాఖ దృష్టి

Published Tue, Aug 9 2016 11:25 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

special care on pushkaraalu

మహబూబ్‌నగర్‌ క్రైం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాబోతున్న కృష్ణా పుష్కరాలలో ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలకు తావివ్వకుండా జిల్లా అబ్కారీ  శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే జిల్లాలో అతి ప్రధానమైన ఘాట్లలలో ఎక్సైజ్‌ సిబ్బంది నిఘా ఉంచనున్నారు. జిల్లాలో బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, సోమశిల, కృష్ణ, పసుపుల, అలంపూర్‌ ఇతర ప్రధాన ఘాట్లలలో ఈ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. ఇప్పటికే ప్రధాన ఘాట్ల వద్ద ఇద్దరు ఎస్‌ఐలతో పాటు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ కానిస్టేబుల్స్‌కు విధులు కేటాయించారు.
   జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద మద్యం, కల్లు, సారా అమ్మకాలు పూర్తిగా అరికట్టాడానికి అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు పుష్కర ఘాట్‌లకు దాదాపు 500నుంచి 600మీటర్ల సమీపంలో ఉండే మద్యం దుకాణాలు పుష్కర రోజుల సమయంలో పూర్తిగా మూసి వేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. దాంతో పాటు ఘాట్ల దగ్గర, జాతీయ రహదారిపై ఎలాంటి మద్యం అమ్మకాలు లేకుండా చేయడానికి ఆ శాఖ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులు ఎవరు కూడా మద్యం, కల్లు, సారా సేవించకుండా ఉండటానికి ఆ శాఖ నుంచి అవగాహన కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement