కోవెలసెంటర్ (నరసాపురం) : పుష్కరాలు ప్రారంభం రోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు.ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్న గోదావరి పుష్కరాలు కేవలం తెలుగుదేశం పార్టీ పుష్కరాలుగా మారిపోయాయని ఆయన విమర్శించారు. నరసాపురం అమరేశ్వరస్వామి ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించిన ఆయన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కొవ్వూరు, సిద్ధాంతం, యలమంచిలి తదితర ప్రాంతాల్లో గోదావరి కలుషితం అవుతుండటంతో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల పనుల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విమర్శించారు. నాయకులు దొంగ గోపాలకృష్ణ, పాలంకి ప్రసాద్, దొండపాటి శామ్యూల్, గుబ్బల మోహనరావు, బర్రి శంకరం పాల్గొన్నారు.
రాజమండ్రి ఘటనకు సీఎం బాధ్యత వహించాలి
Published Sat, Jul 25 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement