సాక్షి, రాజమండ్రి : పోలవరం ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడికి ఏటీఎంలా మారిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాజమండ్రి ఆర్ట్స్ కళశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు మంజూరు చేశామని, ప్రాజెక్ట్ అంచనాలను పెంచి చంద్రబాబు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్‌బాబు పేర్లు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. యూటర్న్ బాబు హెరిటేజ్ సంస్థ కోసమే పనిచేస్తున్నారని, యూటర్న్ బాబు పరిస్థితి బాహుబలి సినిమాలో భల్లాలదేవలా ఉందని ఎద్దేవా చేశారు. యూటర్న్ బాబు చేస్తుంది నమ్మకద్రోహం, అవినీతని, ప్రజల డేటాను యూటర్న్ బాబు దొంగలించారని మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అగ్రవర్ణపేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించింది తామేనని, ఆంధ్రుల అభివృద్ధే బీజేపీ లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment